Gulbadin Naib Acting: కావాలనే అలా చేశారు.. ఆఫ్ఘన్ బౌలర్ పై ఆరోపణలు.. అదే నిజమైతే?

ఆఫ్ఘన్ బౌలర్ గుల్బాదిన్ నైబ్ మ్యాచ్ మధ్యలో కండరాల నొప్పితో బాధపడుతున్నట్టు పడిపోయాడు. అయితే, వాన పడితే మ్యాచ్ గెలవడం కోసం కావాలని సమయం వృధా చేయడానికి అలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అసలు మ్యాచ్ లో ఏమి జరిగింది? ఆరోపణలు ఎందుకొచ్చాయి.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Gulbadin Naib Acting: కావాలనే అలా చేశారు.. ఆఫ్ఘన్ బౌలర్ పై ఆరోపణలు.. అదే నిజమైతే?

Gulbadin Naib Acting: టీ20 క్రికెట్ లో పెనుసంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పెద్ద మచ్చను మోయాల్సి వస్తోంది. తొందరపాటు కానీయండి.. ఎలాగైనా గెలవాలని అనుకోనీయండి.. ఆ టీమ్ హెడ్ కోచ్ ట్రాట్.. బౌలర్ గుల్బాదినా నైబ్ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ విజయ వేడుకల్లో ఇది మచ్చగా కనిపిస్తోంది. అసలేం జరిగిందంటే.. 

Gulbadin Naib Acting: ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ చేరుకోవడం ఆఫ్ఘన్ కు ఖాయం. అదే సమయంలో ఆఫ్ఘన్ ఇచ్చిన 115 పరుగుల లక్ష్యాన్న్ని 12 ఓవర్లలోపు పూర్తి చేస్తే బంగ్లాదేశ్ సెమీస్ కి వెళుతుంది. ఒకవేళ చివరి వరకూ ఆది బంగ్లాదేశ్ గెలిస్తే.. ఆస్ట్రేలియాకు సెమీస్ కు చేరే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలవడానికి చాలా కష్టపడింది. సమిష్టిగా కృషి చేసింది. కానీ.. 11.4 ఓవర్లు ఆట జరిగేసరికి బంగ్లాదేశ్ 81/7 పరుగులు చేసింది. సరిగ్గా ఈ సమయంలో వర్షం పాడడం ప్రారంభం అయింది. ఒకవేళ అప్పుడు కానీ, వర్షం కారణంగా ఆట ఆగిపోతే.. ఆఫ్ఘన్ రెండు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచేసే ఛాన్స్ ఉంది. అప్పుడు చినుకులు పడుతున్నా.. మిగిలిన రెండు బాల్స్ పూర్తి చేయమని అంపైర్లు నూర్ ఆహ్మ‌ద్‌ను ఆదేశించారు. అయితే, ఆ రెండు బంతుల్లో కనుక బంగ్లాదేశ్ నాలుగు పరుగులు చేస్తే.. తరువాత వర్షం కారణంగా ఆట ఆగిపోతే.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్ గెలుస్తుంది. సరిగ్గా.. ఇది గమనించిన ఆఫ్ఘన్ హెడ్ కోచ్ ట్రాట్ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతుందని భావించి.. డగౌట్ నుంచి ఆఫ్ఘన్ ఆటగాళ్లకు ఆలస్యం చేయమని సైగలు చేశాడు. దీంతో  స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. కండరాల నొప్పితో విలవిలా లాడాడు. దీంతో మ్యాచ్ కొంత సేపు అగింది. కానీ, తరువాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ కొనసాగింది. 

Gulbadin Naib Acting: అయితే, మళ్ళీ మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే  గుల్బాదిన్ నైబ్ బౌలింగ్ చేయడానికి ఫీల్డులోకి వచ్చాడు. దీంతో అంతా అవాక్కయ్యారు. ఎందుకంటే అంతకు ముందే గుల్బాదిన్ నడవలేని పరిస్థితిలో ఫీల్డ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. అతని బాధ చూస్తే కచ్చితంగా మళ్ళీ ఆడదానికి కాదు కదా. కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు. దీంతో అతను కావాలనే నాటకం ఆడాడని అర్థం అవుతోందంటూ వివాదం రేగింది. ఆఫ్ఘన్ బంగ్లాదేశ్ మీద గెలిచింది నిజాయతీగానే కావచ్చు. కానీ, వర్షం పడుతుందేమో అని.. ఆట ఆలస్యం చేయడం కోసం గుల్బాదిన్ కండరాల నొప్పి అంటూ పడిపోవడం మాత్రం తప్పే అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఇదిలా ఉంటె.. ఇలా కావాలని మ్యాచ్ ఆలస్యం కావడానికి ప్రయత్నిస్తే.. అది రుజువైతే ఏమి జరుగుతుందంటే.. 

రూల్స్ ఇవీ.. 

Gulbadin Naib Acting: ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా టైమ్ వెస్ట్ చేస్తే కనుక.. ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి  100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా,  రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించవచ్చు. 

అలాగే, అంతర్జాతీయ టీ20ల్లో  41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్‌లకు ఉంటుంది.  అయితే, ఈ  మ్యాచ్‌లో అంపైర్‌లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. 

అంతేకాకుండా  నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు  ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisment
తాజా కథనాలు