/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mla-2-jpg.webp)
YCP MLA Varaprasad Rao: ఏపీలో ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ బీజేపీలో చేరారు. వైసీపీ ఈ సారి టికెట్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో కమలం గూటికి చేరుకున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ ను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి. 2014లో తిరుపతి నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కీలక పదవుల్లో పనిచేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత ఆప్తుడుగా ఉన్నారు.