Gudlavalleru Engineering College : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్‌లో ఓ ప్రముఖ రాజకీయ నేత కుమార్తె సీక్రెట్ కెమెరా పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి తండ్రి ప్రిన్సిపల్‌కు ఫోన్‌చేసి నా కూతురు పేరు బయటకు వస్తే.. డ్రగ్స్ కేసు పెట్టి కాలేజీ మూయిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం
పొలిటీషియన్‌తో కాలేజీ ప్రిన్సిపల్ కుమ్మక్కయి.. ఏదైనా ఉంటే బయట చూసుకోండి, కాలేజీ పేరు బయటకు రావొద్దని డీల్ చేశారని.. కేసును సైలెంట్‌గా క్లోజ్ చేసే పనిలో కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నారని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. తమను ఫెయిల్ చేస్తామని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు వర్షంలో సైతం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
అమ్మాయిల వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి విజయ్ ని సహచర విద్యార్థులు దాడి చేశారు. కెమెరాని ఏర్పాటు చేయడంలో విజయ్ కి మరో విద్యార్థిని సహకరిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే, విద్యార్థి విజయ్ కు సహకరిస్తున్న విద్యార్థిని ఓ ప్రముఖ రాజకీయ నేత కుమార్తె అని.. అందుకే అధికారులు సరిగ్గా విచారణ చేయడం లేదని విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు.
పలువురు విద్యార్థులు బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా పోస్టులు కూడా పెట్టారు. ఈ ఘటన వారం క్రితమే వెలుగులోకి వచ్చినప్పటికీ యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోతున్నారు. విజయ్ నుంచి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్ లలో ఎటువంటి సీసీ కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేశారు.