AP: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆగని దారుణాలు.. అమ్మాయిని తప్పించడానికి..!

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో దారుణాలు ఆగడం లేదు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పొలిటికల్ ప్రెజర్‌ వల్లే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

New Update
AP: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆగని దారుణాలు.. అమ్మాయిని తప్పించడానికి..!

Gudlavalleru Engineering College: గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌ లో హిడెన్‌ కెమెరాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కాలేజీలో దారుణాలు ఏ మాత్రం ఆగడం లేదు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేసి అర్ధరాత్రి కాలేజీ నుంచి అమ్మాయిని ఇంటికి పంపింది.

Also Read: సచివాలయ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. భారీ వర్షాంలో పెన్షన్ పంపిణీపై సర్కార్ కీలక ఆదేశాలు..!

అయితే, మళ్లీ ఆ యువతిని తిరిగి కాలేజీకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా కాలేజీ అమ్మాయిల ఫోన్ సంభాషణ బయటికొచ్చినట్లు తెలుస్తోంది. పొలిటికల్ ప్రెజర్‌ వల్లే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల ఆందోళనతో కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలోనే, ఆందోళనను అదుపుచేసేందుకు యాజమాన్యం.. కాలేజి నుంచి అమ్మాయిలను బయటకు పంపుతుండగా విద్యార్థి సంఘాల నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తోన్నారు. హాస్టల్ నుంచి విద్యార్థులు అందరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత ఘటనపై ఎవరితో విచారణ చేస్తారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..

అసలేం జరిగిందంటే..

ఓ ప్రముఖ రాజకీయ నేత కుమార్తె హాస్టల్ వాష్‌రూమ్‌ లో కెమెరాని ఏర్పాటు చేసి బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న విజయ్‌ అనే మరో విద్యార్థి ద్వారా అమ్మాయిల వీడియోలు విక్రయిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే రెండో రోజు కాలేజీ విద్యార్థులు ఆందోళన దిగారు.

Advertisment
తాజా కథనాలు