Gudivada Politics: కొడాలి నానికి భారీ షాక్‌.. గుడివాడ బరిలో కొత్త అభ్యర్థి!

గుడివాడ వైసీపీలో గంగరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ గుడివాడ ప్రధాన కూడళ్లలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.

New Update
Gudivada Politics: కొడాలి నానికి భారీ షాక్‌.. గుడివాడ బరిలో కొత్త అభ్యర్థి!

Kodali Nani vs Mandali Hanumantha Rao: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల మధ్యే కాదు.. సొంత పార్టీ నేతల మధ్య కూడా రాజకీయం నడుస్తోంది. సీటు కోసం ఒకరిపైఒకరు తలపడుతున్నారు. ఇది కాస్త పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తోన్న నేతలకు మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి షాక్‌లు తగులున్నాయి. జగన్‌పై ఎవరు ఏ చిన్న మాట అన్నా మాటలతో విరుచుకుపడే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి గట్టి దెబ్బ తగిలినట్టుగానే కనిపిస్తోంది.

బ్యానర్లతో మొదలైన రచ్చ:
గుడివాడ వైసీపీలో అసమ్మతి సెగ బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసీపీ నేతల గుసగుసలాడుకుంటున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

గుడివాడ వైసీపీలో గందరగోళం నెలకొనడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు సంచలనంగా మారడంతో మండలి హనుమంతరావు పేరుతో ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. గుడివాడ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు వెలిసిన గంటలోపే వాటిని తొలగించారు. కొడాలి నాని ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని మండల హనుమంతరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు.

Also Read: మేడారం జాతరకోసం పోలీసుల ప్రత్యేక మొబైల్ యాప్

Advertisment
తాజా కథనాలు