Google Pixel: గూగుల్ పిక్సెల్ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్!

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లతో పిక్సెల్ 7 ఫోన్‌ను 32 వేల లోపు, పిక్సెల్ 7 ప్రోను 43 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఛాన్స్ కొన్ని రోజులు మాత్రమే!

Google Pixel: గూగుల్ పిక్సెల్ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్!
New Update

Google Pixel:టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది, దీన్ని ఇప్పుడు తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్.

ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా గూగుల్ పిక్సెల్ 7(Google Pixel), పిక్సెల్ 7 ప్రోపై పెద్ద ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు కొన్ని రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు గూగుల్ పిక్సెల్ 7ను ₹32,000 లోపు, పిక్సెల్ 7 ప్రోను ₹43,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

పిక్సెల్ 7 రేటు ₹32,999, పిక్సెల్ 7 ప్రో ₹44,999. మీరు బ్యాంక్ ఆఫర్ ఉపయోగిస్తే, ₹1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. EMI లో కొనుగోలు చేస్తే, ₹1,500 వరకు తగ్గింపు కూడా అందుతుంది.

గూగుల్ పిక్సెల్ 7 లో 6.3-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, టెన్సర్ G2 చిప్‌సెట్, 8GB RAM, 128GB స్టోరేజ్, 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ సేవలకు అంతరాయం..కారణం ఏంటంటే!

పిక్సెల్ 7 ప్రో 6.7-అంగుళాల Quad HD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 12GB RAM, 128GB, 256GB లేదా 512GB స్టోరేజ్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

ఈ అద్భుతమైన ఆఫర్‌ను మిస్ కాకండి!

#google-pixel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe