ఉద్యోగులకోసం పత్రిక నుంచి తప్పుకున్న ఎడిటర్!

ఓ వార్తా పత్రిక సంస్థ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగుల కోసం పెద్ద త్యాగం చేశారు. ఆయన వారికోసం ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. అవును మీరు విన్నది నిజమే. వారు అసలు ఇలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం

New Update
ఉద్యోగులకోసం పత్రిక నుంచి తప్పుకున్న ఎడిటర్!

అమెరికా మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ కేంద్రంగా పనిచేసే అతిపెద్ద వార్తా పత్రిక ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. 2022 సంవత్సరంలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. కంపెనీలు నష్టాలను తట్టుకోలేక.. లాభదాయకంగా మారడానికి ఉపయోగించే అస్త్రం. అదేనండి ఉద్యోగులను తొలగించుకోవడం. అయితే ప్రముఖ వార్తాపత్రిక ఒకటి కూడా అదే విధంగా ఉద్యోగులను తొలగించాలని యోచించింది. ఇదే సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఎడిటర్. ఉద్యోగుల కోసం తానే స్వయంగా ఎడిటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతా ఆయనపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం అయిందంటే?

డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ (Detroit Free Press). అమెరికా మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ కేంద్రంగా పనిచేసే అతిపెద్ద వార్తా పత్రిక. ఇది ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. కారణం.. ఆ సంస్థ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ అయిన పీటర్ భాటియా తప్పుకోనుండటం. అవును ఉద్యోగుల కోసం ఆయన పెద్ద త్యాగం చేశారు.

ఇటీవలి కాలంలో లేఆఫ్స్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. పలు కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి, లాభదాయక కంపెనీలుగా మారేందుకు, రానున్న సంక్షోభ పరిస్థితులను తట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. ఇదే క్రమంలో డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ కూడా ఇదే చేస్తోంది. దీంతో తట్టుకోలేకపోయిన ఎడిటర్ స్వయంగా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్‌పై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంస్థ బడ్జెట్ నుంచి తనకు వచ్చే వేతనం ఆపేస్తే.. అది ఎందరో ఉద్యోగులకు ప్రయోజనం కల్పిస్తుందని, అది మంచి అభిప్రాయమేనని అన్నారు పీటర్ భాటియా. తనకు ఇతర ఉద్యోగ అవకాశాలు బయట దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

బలవంతపు తొలగింపులతో (Layoffs) న్యూస్‌రూం ఎక్కువగా ప్రభావితం అవుతుందని ఈ డిసెంబర్ ప్రారంభంలో చెప్పారు పీటర్ భాటియా. డిసెంబర్ 12నే కాస్ట్ కట్ టార్గెట్ పెట్టుకున్నారని, దీని ప్రకారం ఐదుగురు రిపోర్టర్లు, నలుగురు అసిస్టెంట్ ఎడిటర్లు, ముగ్గురు వెబ్‌సైట్ ప్రొడ్యూసర్లు, ఒక ఫొటోగ్రాఫర్, ఒక ఎడిటోరియల్ అసిస్టెంట్‌పై ప్రభావం చూపొచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వారి ఉద్యోగాలు పోవడం ఇష్టంలేక, తట్టుకోలేక ఆయనే స్వయంగా వైదొలిగిందేకు సిద్ధమయ్యారు.

69 ఏళ్ల భాటియా.. 2017 సెప్టెంబర్‌లో ఫ్రీ ప్రెస్‌లో చేరారు. ఇండియన్ అమెరికన్ అయిన భాటియా.. ప్రఖ్యాత పులిట్జర్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. ఓహియో, మిచిగాన్‌లో ఉన్న USA TODAY నెట్‌వర్క్ 30 ప్రాపర్టీలకు ఈయన రీజనల్ ఎడిటర్‌గా కూడా ఉన్నారు. జనవరిలో లేఆఫ్స్ అమలు చేయనుంది డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్. దీంతో తనకు వచ్చే వేతనంతో లేఆఫ్స్ సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పీటర్.

2022 సంవత్సరంలో లేఆఫ్స్ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలెన్నో ఉద్యోగులను తొలగించడం గమనార్హం. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా వంటి అంతర్జాతీయ కంపెనీలే కాకుండా.. దేశీయంగానూ టీసీఎస్, కాగ్నిజెంట్, అసెంచర్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగులను పీకేశాయి. మరోవైపు ఇదే సమయంలో మూన్‌లైటింగ్‌తో కూడా చాలా మంది ఉద్యోగాలు పోయాయి.

Advertisment
తాజా కథనాలు