IPl 2024 Opening Ceremony : గ్రాండ్‎గా ఐపీఎల్​ ఓపెనింగ్ సెర్మనీ..స్పెషల్ అట్రాక్షన్‎గా బాలీవుడ్ సెలబ్రిటీలు..!

ఐపీఎల్ 2024 సీజన్ 17 ఓపెనింగ్ సెర్మనీ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సెర్మనీలో బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సింగర్ సోనూ నిగమ్ వందేమాతరం గేయంతో ఆకట్టుకున్నారు. రెహమాన్ మా తుజే సలామ్ పాటతో ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించారు.

New Update
IPl 2024 Opening Ceremony : గ్రాండ్‎గా ఐపీఎల్​ ఓపెనింగ్ సెర్మనీ..స్పెషల్ అట్రాక్షన్‎గా  బాలీవుడ్ సెలబ్రిటీలు..!

IPl 2024 Opening Ceremony : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా సాగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. ఈ సెర్మనీలో బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సింగర్ సోనూ నిగమ్ వందేమాతరం గేయంతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మా తుజే సలామ్ పాటతో స్టేడియంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ జాకీష్రాఫ్ స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. వీరంతా ఈ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక లైటింగ్ షో ఓపెనింగ్ సెర్మనీకి మరింత స్పెషల్ గా నిలిచాయి.

ఇది కూడా చదవండి:  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు