MLA Jaggireddy: ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిరసన సెగ

అంబెద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యేపై గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలు నశించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దళితులను అన్యాయంగా కేసులలో ఇరికించారని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
MLA Jaggireddy: ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిరసన సెగ

Kothapet MLA Jaggireddy: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిరసన సెగ తగిలింది. గోపాలపురంలో స్కూల్ భవనం ప్రారంభోత్సవంకు వచ్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై స్థానిక గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వేసిన పూలమాలలను తీసివేశారు. పేపర్ ప్లేట్ పై అంబేద్కర్ ఫోటోలు వేసి అవమానించి ఇప్పుడు ఎలా దండలు వేస్తారు అంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: వావ్..! సినిమాకు మించి రకుల్ వెడ్డింగ్ వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అంతేకాకుండా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్యాయంగా దళితులను అక్రమ కేసులలో ఇరికించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలు నశించాలంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు గ్రామస్తులు. నిన్నటి నుండి గ్రామంలోకి ఎమ్మెల్యే రాకూడదని స్థానికులు చెబుతున్నప్పటికి ఎమ్మెల్యే జగ్గరెడ్డి మాత్రం భారీ పోలీస్ బందోబస్తు పెట్టుకొని వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొంతకాలం క్రితం ఎమ్మెల్యే జగ్గారెడ్డి వద్దకు వెళ్ళకూడదు అంటూ తీర్మానం చేసుకున్నారు.

Also Read: టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష్ణ అరెస్ట్.. కారణం ఇదే..!

ఇదిలా ఉండగా..ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ప్రచారాల బాట చేపట్టారు. అయితే, ప్రజలు మాత్రం కేవలం తమ సమస్యలు తీర్చిన వారినే సదారంగా ఆహ్వానిస్తున్నారు. లేదంటే గ్రామంలోకి రావద్దంటూ ఖరకండిగా  చెప్పేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలోని పలువరి ఎమ్మెల్యేలకు వరుసగా నిరసన సెగలు తగులుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు