AP Govt: ఏపీలోని పేదలకు శుభవార్త.. ఆ స్కీం బెనిఫిట్స్ రూ.25 లక్షల వరకు పెంపు.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్!

ఏపీలోని నిరుపేదలకు శుభవార్త. నేటి నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద రూ. 25లక్షల వరకు ఫ్రీగా వైద్యం అందిస్తుంది సర్కార్.

New Update
YCP Focus:  విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!

ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం జగన్ మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుట్టారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దారు. దీనిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇప్పటి నుంచి రూ. 25లక్షల వరకు ఫ్రీగా వైద్యం అందించే కార్యక్రమంతోపాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీని కూడా సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి నేడు ప్రారంబిస్తారు.

ఇక లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవడం, దానితో ఫ్రీగా వైద్యం ఎలా చేయించుకోవాలని, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి..ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివ్రుత్తి చేసే కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతి ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వయంగా చూడనున్నారు. తద్వారా 1.48కోట్ల కుటుంబాలకు 4.25కోట్ల మంది లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించనున్నారు.

కొత్త కార్డుల ఫీచర్లు ఇలా ఉంటాయి:
ప్రతీకార్డులో క్యూఆర్ కోడ్, లబ్దిదారునిఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో నమోదు చేసిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతోపాటు ఏబీహెచ్ఏ ఐడీ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ తో లాగిన్ అయితే రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రుల్లో చేరేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా అనుసంధానమైన మార్గాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆరోగ్యమిత్ర కాంటాక్టు నెంబర్లు కూడా తెలుసుకోవచ్చు. దీనిద్వారా రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు, సిబ్బందికి పూర్తి అవగాహన కలుగుతుంది. మెరుగైన ఫ్రీ వైద్యం లభించేందుకు మార్గం మరింత సులభంగా మారుతుంది.

ఇది కూడా చదవండి: తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగితే డేంజర్.. ఎందుకంటే?

Advertisment
తాజా కథనాలు