Gold Rate: మన దేశంలో బంగారంపై విపరీతమైన మోజు ఉంటుంది. పండుగ సమయాల్లో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. అందులోనూ దీపావళి పండుగ అంటే బంగారం కొనాలని చాలామంది పరుగులు తీస్తారు. అందుకే ఎప్పుడూ దీపావళి పండుగ సమయంలో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అయితే, ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. బంగారం ధరలు బాగా దిగివచ్చాయి. పండుగ వారంలో ప్రతి రోజూ బంగారం ధరలు కింది చూపులే చూశాయి. దేశవ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ లో కూడా బంగారం ధరలు తగ్గాయి.
గత వారంలో దేశీయంగా బంగారం ధరల(Gold Rate) పరిస్థితి ఒకసారి చూద్దాం. నవంబర్ 6 వతేదీ సోమవారం బంగారం ధరలు 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.56,350లు ఉండగా, అది 12 నవంబర్ నాటికి రూ.55,540లు వద్దకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.61,470 రూపాయల నుంచి రూ.60,590లకు ఈ వారంలో తగ్గింది.
ఇక హైదరాబాద్ లో గత వారం ప్రారంభంలో బంగారం ధరలు 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.56,450 నుంచి రూ.55,540లకు పడిపోయింది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,470 రూపాయల నుంచి రూ.60,590లకు దిగి వచ్చింది.
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా కిలో వెండి నవంబర్ 6వ తేదీన రూ.75,200లుగా ఉంది. ఇది వారం చివరికి అంటే నవంబర్ 12 నాటికి 73,200 రూపాయలకు పడిపోయింది. అంటే, 2 వేల రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో కూడా గత వారం వెండి ధరలు పతనం అయ్యాయి. వారం ప్రారంభంలో కేజీ వెండి ధర ఇక్కడ రూ.78,200లు ఉండగా, వారం చివరి నాటికి ఇది 76,000 రూపాయలకు పడిపోయింది. అంటే 2,200 రూపాయలు తగ్గింది.
Also Read: పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!
గత వారం ప్రారంభం నుంచి ప్రతిరోజూ బంగారం, వెండి ధరలు పడిపోతూ వచ్చాయి. అయితే, మధ్యలో ఒకరోజు అంటే నవంబర్ 10వ తేదీన మాత్రం కాస్త పెరుగుదల కనబరిచాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వారం కూడా బంగారం ధరల్లో పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాకుండా రికార్డు స్థాయికి మన దేశంలో బంగారం ధరలు పెరగడంతో ప్రజలు కూడా ఆచి తూచి బంగారం కొంటున్నారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం డిమాండ్ బాగా తగ్గింది. అందువల్ల బంగారం ధరల్లో తగ్గుదల నమోదు అవుతూ వస్తోంది.
ఇక ఈరోజు అంటే నవంబర్ 13వ తేదీ కూడా బంగారం ధరలు దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ ప్రారంభం అయ్యేసరికి బంగారం ధరలు కిందికే చూస్తూ ఉన్నాయి. మొత్తమ్మీద ఈ సంకేతాలు చూస్తుంటే ఈ వారం కూడా బంగారం ధరలు తక్కువగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని గమనించి బంగారం కొనాలని అనుకున్నపుడు మార్కెట్ ధరలు పరిశీలించి బంగారం కొనుగోలు చేయాలి
Watch this interesting Video: