Gold And Silver Price Today : నిన్న కాస్త పెరిగి మళ్ళీ పెరిగిపోతాయా అని టెన్షన్ పెట్టిన బంగారం ధరలు (Gold Rates) ఈరోజు మార్పులు లేకుండా నిలిచాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిన్న కాస్త తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే వరుసగా రెండో రోజూ వెండి ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే ఆగస్టు 30న బంగారం ధరలు గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పాయని చెప్పాలి. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదల బాటలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) పెరిగే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold and Silver Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధరల వద్దే నిలిచింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు మార్పులు లేకుండా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు మార్పులు లేవు. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా టెడ్ అవుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి
22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 67,150
24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,250
ఇక విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .
22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 67,150
24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,250
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకెగశాయి . ఈరోజు పెరుగుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 67,300
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,340
Gold And Silver Price బంగారం ధరలు స్థిరంగా ఉంటే . . మరోవైపు ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు వరుసగా రెండో రోజూ మార్పులు లేకుండా నిలిచాయి. హైదరాబాద్ లోనూ , ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 93,500 గానూ , ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 88,500 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .
ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు అంటే ఆగస్టు 30 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,518 డాలర్ల వద్ద ఉన్నాయి . అలాగే వెండి ధరలు కూడా పెరుగుదల బాటలో కేజీకి 946 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.