City bank: భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన బ్యాంకింగ్ దిగ్గజం! ప్రపంచంలోనే పెద్ద బ్యాంకుల్లో ఒకటి అయినటువంటి సిటీ బ్యాంకు తన ఉద్యోగుల్లో నుంచి దాదాపు 2000 మందిని తొలగించినట్లు ప్రకటించింది.ఈ ఆర్థిక ఏడాది 2023- 24 మూడో త్రైమాసికంలో కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ చర్యలకు ఉపక్రమించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మొత్తంగా 7000 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. By Bhavana 14 Oct 2023 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Lay Off: దేశంలో కొవిడ్ (covid) తరువాత అన్ని రంగాల పై ఆర్థిక పరిస్థితులు దండెత్తాయి. ఒక్కసారిగా ఆర్థిక రంగాన్ని కిందకి లాగి పడేశాయి. దేశం నుంచి కొవిడ్ పారిపోవడంతో అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కొంచెం తెరుకుంటున్నాయి. అయినప్పటికీ వాటి ప్రభావం ఇంకా కొన్ని రంగాల మీద ఉంది. దాంతో ఆర్థిక పరిస్థితులు భరించలేక చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంది. ఐటీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఈ పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. నిత్యం ఏదోక కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటిస్తూనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే పెద్ద బ్యాంకుల్లో ఒకటి అయినటువంటి సిటీ బ్యాంకు తన ఉద్యోగుల్లో నుంచి దాదాపు 2000 మందిని తొలగించినట్లు ప్రకటించింది. Also read: చంద్రబాబు కి హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ఈ ఆర్థిక ఏడాది 2023- 24 మూడో త్రైమాసికంలో కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ చర్యలకు ఉపక్రమించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మొత్తంగా 7000 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో ఇంకా కంపెనీ నుంచి ఎంత మందిని తీసివేస్తారో అనే సందేహంలో ఉద్యోగులు ఉన్నారు. తాజాగా 2000 మంది ఉద్యోగులను తొలగించిన కారణంగా వారికి దాదాపు 650 మిలియన్ డాలర్లను సిటీ గ్రూప్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పుడే కాదు..జూన్ లో తొలగించిన ఉద్యోగులకు 450 మిలియన్ డాలర్లను కంపెనీ పరిహారంగా చెల్లించినట్లు తెలుస్తుంది. రానున్న కాలంలో మరింత మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. తాజా లే ఆఫ్స్ ప్రకటన తర్వాత సిటీ బ్యాంకింగ్ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న మొత్తం ఉద్యోగులు సంఖ్య 2,40,000 గా ఉంది. వరుస లేఆఫ్స్ ప్రకటనలతో సిటీ గ్రూప్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. #financial-issues #lay-offs #city-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి