Ghee Health:
సాధారణంగా మనం రోజూ తినే ఆహారంలో నెయ్యి వేసుకొని తినడం సహజం. అంతే కాదు కొన్ని సార్లు రుచి కోసం బ్రెడ్, చపాతీ, ఇలా రకరకాల ఐటమ్స్ లో వేసుకొని తింటాము. మరి కొంత మంది బరువు పెరుగుతాము అనే భయంతో దీనిని తినడానికి ఇష్టపడరు. నెయ్యి కేవలం రుచిగా ఉండడమే మాత్రం కాదు దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెయ్యి తినేటప్పడు శరీరానికి కావల్సిన మోతాదులో మాత్రమే తినాలని చెబుతున్నారు నిపుణులు.
ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం
ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నెయ్యి తింటే శరీరం వెచ్చగా ఉండడానికి సహాయపడును. జలుబు వల్ల ముక్కు దిబ్బడతో బాధపడే వారికి ఇది చక్కని చిట్కాల ఉపయోగపడును. అంతే కాదు నెయ్యి.. ముక్కులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న కూడా త్వరగా తగ్గించడానికి సహాయపడును.
శరీరంలో మంటను తగ్గించును
నెయ్యి తినడం వల్ల దానిలోని బ్యుట్రిక్ ఆసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపు, లేదా ఏదైనా గాయాల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
కీళ్ల నొప్పిని తగ్గించును
నెయ్యి కీళ్ల నొప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాపు మంటను తగ్గిస్తాయి. అలాగే కీళ్లు, కణజాలాన్ని లూస్ చేయడానికి ఒక లూబ్రికెంట్ లా పని చేస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచను
నెయ్యిలో ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల దీనిని రోజు తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచును
జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడును
నెయ్యిలో ఉండే బ్యుట్రిక్ యాసిడ్ వేడి నీటితో కలిసినప్పుడు జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి తోడ్పడుతుంది. అంతే కాదు మలబద్దకం, కడుపుబ్బరం, కడుపు నొప్పి సమస్యలను దూరం చేయును. అలాగే పోషకాలు శోషణకు సహయపుడుతుంది.
Also Read: Heart Attack Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. గుండె పోటు వచ్చే ప్రమాదం..!