Garlic Hair Colour: వెల్లుల్లి పొట్టు హెయిర్ కలర్.. ఇది పెడితే తెల్ల జుట్టు మాయం

తెల్ల జుట్టు నల్లగా మారడానికి రకరకాల హెయిర్ కలర్స్, ప్రాడక్ట్స్ వాడతారు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెల్లుల్లి పొట్టు, గోరింటాకు మిశ్రమంతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీని తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Garlic Hair Colour:  వెల్లుల్లి పొట్టు హెయిర్ కలర్.. ఇది పెడితే తెల్ల జుట్టు మాయం

Garlic Hair Colour:  ఈ మధ్య కాలం వయసుతో సంబంధం లేకుండా అందరిలో తెల్ల జుట్టు సమస్య కామన్ అయిపొయింది. ప్రతీ ఒక్కరికి జుట్టు అనేది చాలా స్పెషల్. ముఖ్యంగా ఆడపిల్లకు జుట్టు పై మరింత ఇంట్రెస్ట్ ఉంటుంది. పోషకాహార లోపం, జీవన శైలి విధానాల వల్ల కొంత మందిలో తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలు కనిపిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లగా కనిపించడం ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని కవర్ చేయడానికి ఎన్నో రకాల హెయిర్ కలర్స్, ప్రాడక్ట్స్ వాడుతుంటారు. కానీ వీటి వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ చిట్కాలతో కూడా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి వెల్లుల్లి పొట్టు, గోరింటాకు చేసే హెయిర్ కలర్ బెస్ట్ ఛాయిస్. ఇప్పుడు దీని తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

వెల్లుల్లి పొట్టు హెయిర్ కలర్ కోసం కావాల్సిన పదార్థాలు

  • వెల్లుల్లి పొట్టు : ఒక కప్పు
  • గోరింటాకు : ఒక కప్పు
  • కొబ్బరి నూనె కావాల్సినంత
  • కాఫీ పౌడర్: ఒక చెంచా

తయారీ విధానం

  • ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి పొట్టు, గోరింటాకు ఆకులను వేసి బాగా వేయించుకోవాలి. కాసేపు చల్లారిన తర్వాత దీన్ని పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి .
  • ఆ తర్వాత ఈ పొడిని ఒక గిన్నెలో తీసుకొని దీంట్లో ఒక చెంచా కాఫీ పౌడర్, కాస్త కొబ్బరి నూనె కలపాలి. అంతే నేచురల్ గా తయారైన హెయిర్ కలర్ రెడీ. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అంతా పట్టించి.. కొద్ది సేపు తర్వాత చిన్నగా మసాజ్ చేయాలి.

Also Read: Break Fast: నూనె లేకుండా ఈ అల్పాహారం ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉంటారు

publive-image

  • ఇక ఇప్పుడు గంట పాటు జుట్టుకు పట్టించిన మిశ్రమాన్ని ఆరనివ్వాలి. ఆ తర్వాత కాన్సంట్రేషన్ తక్కువగా ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకేసారి ఇలా చేస్తే మంచి ప్రభావం ఉంటుంది. ఎప్పుడైన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇన్స్టాంట్ గా అప్లై చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
  • జుట్టు రంగు మార్చడంతో పాటు మంచి లుక్ ఇస్తుంది. ఈ పొడిని చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కావలసినప్పుడు దీంట్లో కాస్త నూనె, కాఫీ పొడి కలిపి అప్లై చేస్తే సరిపోతుంది. ఆయిల్ బదులు అలోవెర జెల్ కూడా వాడొచ్చు.

Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు