Ganta Srinivasa Rao: పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రపోజల్ పెట్టిందన్నారు. అయితే, చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నానన్నారు.

New Update
Ganta Srinivasa Rao:  పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Ganta Srinivasa Rao: ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రపోజల్ పెట్టిందని.. అయితే, చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నానని అన్నారు. గతంలో పోటీ చేసిన విశాఖ నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. చీపురుపల్లి తనకు 150కిలో మీటర్ల దూరం అని..పైగా జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచిస్తున్నానని గంటా అన్నారు. చీపురుపల్లి అనేది తనకు సర్‌ప్రైజ్‌ అని వ్యాఖ్యానించారు. సన్నిహితులతో బాగా చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

Also Read: విజయవాడలో ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్?

ఇదిలా ఉండగా బొత్సను ఓడించేందుకు టీడీపీ 'ఆపరేషన్‌ చీపురుపల్లి' చేపట్టింది. బొత్సకు చెక్‌ పెట్టేందుకు గంటానే కరెక్ట్ అంటోంది టీడీపీ. అయితే, నియోజకవర్గంలో మరోమారు సర్వే తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చీపురుపల్లి నుంచి మూడు సార్లు విజయం సాధించిన బొత్స.. గత ఎన్నికల్లో 27 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

Also Read: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!

చీపురుపల్లి నియోజకవర్గానికి 9 సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు విజయం సాధించింది టీడీపీ. మరి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందా? లేదంటే బొత్స నే గెలుస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వచ్చే ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ హోరాహోరీగా ప్రచారాలు చేపట్టాయి. విజయం మాదంటే మాదంటూ ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు