Ganta Srinivasa Rao: మా మొదటి ప్రాధాన్యత ఇదే.. 6 నెలల్లో ఇళ్లు పూర్తి చేస్తాం: గంటా శ్రీనివాసరావు

రాష్ట్రంలో హౌసింగ్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 6 నెలల్లో ఇళ్లు పూర్తి చేసి అందజేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.

Ganta Srinivasa Rao: మా మొదటి ప్రాధాన్యత ఇదే.. 6 నెలల్లో ఇళ్లు పూర్తి చేస్తాం: గంటా శ్రీనివాసరావు
New Update

Ganta Srinivasa Rao: ఎన్నికల్లో ఎన్నడూ లేని ఘన విజయాన్ని కూటమి సాధించిందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గత 5 ఏళ్లలో రాష్ట్రం గాడి తప్పిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం మొదటి సంతకం మెగా డీఎస్సీపై సంతకం పెట్టారన్నారు. 2014-19 బాబు హయంలో అమరావతి, పోలవరంతో పాటుగా పేద వాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పెద్ద పెద్ద కంపిణీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 3360 ఇళ్లులు భీమిలి నియోజకవర్గంలో నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇవి మూడు కేటగిరిలో నిర్మించారన్నారు.

Also Read: ప్లీజ్.. మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. వాలంటీర్ల ఆందోళన.!

అయితే, 2019లో ప్రభుత్వం మారడం దురదృష్టకరమని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇల్లులను పూర్తిగా మరిచారని కామెంట్స్ చేశారు. వీటితో పాటు అన్న క్యాంటీన్లు కూడా మూసివేశారని వెల్లడించారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఇల్లులు అలానే ఉన్నాయన్నారు. మళ్ళీ 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇల్లులు లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనతో పాటుగా అధికారులు కూడా ఈరోజు సందర్శించడం జరిగిందన్నారు. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వం లబ్దిదారులను లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేసిందన్నారు.

Also Read: ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం.. సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు: ఎస్సీ రాంబాబు

వీటితో పాటు హుద్ హుధ్ తో పాటు సినీ ఇండస్ట్రీ వాళ్ళు నిర్మించిన వాటిని కూడా నిజమైన లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు సందర్శించిన ఇల్లులు సర్వే నెంబర్ 114... 6 ఎకరాల్లో 8 బ్లాక్స్ లు 380 యూనిట్లు నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పటికీ 77 రిజిస్ట్రేషన్ కూడా జరిగాయన్నారు. హౌసింగ్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం కూటమి లక్ష్యమని.. 6 నెలల్లో వీటిని పూర్తి చేసి లబ్ధరులకు అందజేస్తామని తెలిపారు. నిజమైన లబ్దిదారులకు చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నార్త్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ ఇల్లు లు ఇచ్చారని కొంతమంది రావడం జరిగిందన్నారు. ఎవరైతే అన్యాయంగా వచ్చారో వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

#ganta-srinivasa-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe