Gangavva in Dubai: సక్సెస్ జర్నీ అంటే ఇలా ఉండాలి కదా! దటీజ్ 'గంగవ్వ'!

ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతిపెద్ద సెలబ్రిటీగా నిలిచింది. మై విలేజ్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన గంగవ్వ.. బిగ్ బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. మరింత పాపులర్ అయ్యింది. తాజాగా గంగవ్వ దుబాయ్‌లో రచ్చ చేస్తోంది. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి. 'ఎక్కడి గంగవ్వ.. ఎక్కడి లంబడిపల్లి.. ఎక్కడ దుబాయ్..' అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

New Update
Gangavva in Dubai: సక్సెస్ జర్నీ అంటే ఇలా ఉండాలి కదా! దటీజ్ 'గంగవ్వ'!

Gangavva in Dubai: గంగవ్వ.. ఓ మారుమూల గ్రామానికి చెందిన వృద్ధురాలు.. ఓ వ్యవసాయ కూలీ.. పొద్దున లేస్తే సద్దిమూట చేతపట్టుకుని.. పొలం పనులకు వెళ్లేది. ఆమెకు ఆమె ఊరే ఒక ప్రపంచం. తన ఊరు పొలిమెర దాటి పొరుగూరుకు కూడా వెళ్లే తీరిక లేకపోయేది. కానీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలచక్రం గిర్రున తిరిగింది. 60 ఏళ్ల వయసులో ఆమె దశ కూడా తిరిగింది. పొరుగూరుకే వెళ్లని ఆమె.. ఏకంగా దేశం కాని దేశంలో హల్ చల్ చేస్తోంది. చూపరులను ఔరా అని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన ఊరు గడప దాటి.. ఇప్పుడు ఏకంగా దుబాయ్‌లో బూర్జ్‌ ఖలీఫా ముందు దర్జాగా నిల్చుకుంది. ఆ బూర్జ్ ఖలీఫానే తన చేతిలో ఇనుమడిపంజేస్తూ ఫోటోలతో రచ్చ చేస్తోంది.

అవును, ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతిపెద్ద సెలబ్రిటీగా నిలిచింది. మై విలేజ్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన గంగవ్వ.. బిగ్ బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. మరింత పాపులర్ అయ్యింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. 60 ఏళ్ల వయసులో గంగవ్వ లైఫ్ టర్న్ తీసుకుంది. ఎవరూ ఊహించని రేంజ్‌లో ఎదిగింది. తాజాగా గంగవ్వ దుబాయ్‌కి పయనమైంది. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల్లో మాత్రమే విజిట్ చేసిన గంగవ్వ.. ఇప్పుడు ఏకంగా విదేశీ పర్యటనలు చేస్తోంది. విదేశీ పర్యటనలతో తాను మురిసిపోతూ.. చూపురులనూ అబ్బురపరుస్తోంది. దుబాయ్ టూర్‌లో ఉన్న గంగవ్వ.. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన బూర్జ్ ఖలీఫాను సందర్శించింది. అక్కడ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారియ.


గంగవ్వ ఫోటోలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆమె ఎదుగుదలను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్‌లో కొన్ని మచ్చుకు.. 'విజయం అంటే ఇదీ.. గెలిస్తే గంగవ్వలాగా గెలవాలి', 'తెలుగు సంప్రదాయాలతో దుబాయ్ వెళ్లి గంగవ్వ గ్రేట్', 'విజయానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని గంగవ్వ నిరూపించింది', 'ఎక్కడి గంగవ్వ.. ఎక్కడి లంబడిపల్లి.. ఎక్కడ దుబాయ్.. మీ అందరి జీవితాలు మార్చాడు శ్రీకాంత్ అన్న. సూపర్ అన్న. మీ అందరినీ అక్కడ చూస్తే చాలా గర్వంగా వుంది' అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Milkuri Gangavva (@gangavva)

Also Read:

శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!

ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!

Advertisment
తాజా కథనాలు