RTV Bramhanandam Interview: వినాయకచవితి అంటే గుర్తుకు వచ్చేది ఇదే.. రంగమార్తాండాతో ఆ కోరిక తీరింది!

చిన్నప్పుడు వినాయకుడు అంటేనే గుర్తుకు వచ్చేది పిండి వంటలైతే.. పెద్దయిన తర్వాత వినాయకుడు అంటేనే ప్రకృతి గుర్తుకు వస్తుందన్నారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. సీరియస్ క్యారెక్టర్లు చేయాలన్న తన కోరికను రంగమార్తాండా సినిమా తీర్చిందన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.

RTV Bramhanandam Interview: వినాయకచవితి అంటే గుర్తుకు వచ్చేది ఇదే.. రంగమార్తాండాతో ఆ కోరిక తీరింది!
New Update

గణేశ్ నిమజ్జనం సందర్భంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. చిన్నప్పుడు వినాయకుడు అంటేనే గుర్తుకు వచ్చేది పిండి వంటలైతే.. పెద్దయిన తర్వాత వినాయకుడు అంటేనే ప్రకృతి గుర్తుకు వస్తుందన్నారు. తన చిన్నతనంలో వినాయక చవితికి ఒక రోజు ముందుగానే వెళ్లి 21 రకాల పత్రాలను తీసుకుని వచ్చే విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పండుగ వచ్చిందంటే మొదట్లో పులిహోర, పాయసం అన్నీ తినేస్తామన్నారు. కానీ ఓ వయస్సు వచ్చిన తర్వాత ఆరోగ్య రిత్యా వాటిని వదిలేసే పరిస్థితి వచ్చిందన్నారు. తనకు అన్ని రకాల వంటకాలు ఇష్టమేనన్నారు. ఈ సృష్టికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులని బ్రహ్మానందం అన్నారు. మనకు జన్మనిచ్చిన వారిని నిరంతరం స్మరించుకోవడమే భక్తి అని అన్నారు.

కరోనా సమయంలో దొరికిన ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న వచ్చిన ఆలోచనలో భాగంగా బొమ్మలు గీశానని గుర్తు చేసుకున్నారు బ్రహ్మానందం. కొన్ని బొమ్మలు ఆన్లైన్ ద్వారా అమ్మకానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. వచ్చిన డబ్బులను సోషల్ సర్వీస్ కు వాడాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పది మంది బ్రహ్మానందాలు కలిపితే తన మనవడు అని చెప్పారు బ్రహ్మానందం. ఇటీవల తాను ధుర్యోదనుడి మాదిరిగా చెప్పిన డైలాగ్ ను తన మనవడు చాలా ఈజీగా చెప్పాశాడని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.

డబ్బు ఉంటేనే సమాజంలోనే గౌరవం ఉంటుందన్నారు. డబ్బు అంటే తనకు ప్రేమ కాదు.. కసి అని అన్నారు. మరింత డబ్బు సంపాధించాలని, మరింత గౌరవం ఉంటుందనే ఆలోచనతోనే సినిమాల్లోకి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు బ్రహ్మానందం. తన పుట్టిన రోజు సందర్భంగా మీమర్స్ అంతా వచ్చి మా కుటుంబాలన్నీ మీ పేరు చెప్పుకుని బతుకుతున్నాయని చెప్పినప్పుడు తనకు కంటనీరు వచ్చినంత పనైందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన మీమ్స్ మీద పేటెంట్ రైట్స్ తీసుకుంటే చాలా డబ్బులు వస్తాయని ఒకరు సలహా ఇచ్చారని చెప్పారు హాస్యబ్రహ్మ. కానీ.. దేవుడు తనకు కావాల్సిందానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాడన్నారు. ఇతరులకు ఉపాధిని దెబ్బకొట్టే ఈ డబ్బు తనకు అవసరం లేదని చెప్పారు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో తాను ఓ కొత్త భాషను కనిపెట్టానని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. దేవుడే తన తల్లిదండ్రులతో తనకు ఈ బ్రహ్మానందం అనే పేరు పెట్టాలని చెప్పాడన్నారు. పేరుకు తగినట్లుగా తాను ఇతరులకు ఆనందాన్ని పంచే అవకాశం వచ్చిందిని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.

తనకు నచ్చిన సినిమాల్లో అదుర్స్ ఒకటి అని అన్నారు. ఆ సినిమా విషయాలను, తన కామెడీ బాగా కుదిరిందని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. తనకు సీరియస్ క్యారెక్టర్లు చేయాలని కోరిక ఉండేదన్నారు. కానీ తనను చూస్తేనే ప్రేక్షకులు నవ్వే పరిస్థితి ఉందన్నారు. రంగమార్తాండ సినిమాతో ఆ కోరిక తీరిందని చెప్పారు బ్రహ్మానందం. రంగమార్తాండ ముందు తాను చేసిన సినిమాలు ఒక ఎత్తని.. రంగమార్తాండ సినిమా మరో ఎత్తు అని అన్నారు. ఆ సినిమాలో డెత్ సీన్ కోసం రెండు మూడు రోజులు భోజనం చేయలేదన్నారు.

#rtv #ganesh-nimajjanam-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe