TTD: వైకుంఠ ఏకాదశిలో శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే ఈ పని చేయండి..!!

డిసెంబర్ 23వ తేదీ వైకుంఠఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ ఇప్పటికే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆన్లైన్ లో రిలీజ్ చేసింది. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఎస్ఎస్డీ టైం స్లాట్ టాకెన్స్ ను డిసెంబర్ 22వ తేదీ జారీ చేయనుంది. 10రోజులకు 4,23,500 టికెట్లను జారీ చేయనున్నారు.

TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి..!!
New Update

హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైన స్థానం ఉంది. ఇది ధనర్మాసంలో వస్తుంది. ఈ రోజు ప్రజలు దేవుణ్ణి రకరకాలుగా పూజిస్తుంటారు. 2023లో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23వ తేదీన వస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువుదీరిన ఆధ్యాత్మిక దివ్యదామం తిరుమల. శ్రీవారి దర్శనార్థం వివిధ మార్గాల ద్వారా భక్తులకు తిరుమలకు చేరుకుంటారు. వివిధ క్యూలన్ ల ద్వారా స్వామివారి ఆలయానికి చేరుకుని దివ్యమైన సాలగ్రామ రూపాన్ని తనివితీరా చూస్తారు. అలా స్వామివారిని దర్శిస్తే పాపాలన్నీ తొలగిపోయి..శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

అలాంటిది శ్రీ మహావిష్ణుయోగ నిద్రలో నుంచి మేల్కోనే రోజుగా వైకుంఠఏకాదశిని పేర్కొంటాయి ధర్మశాస్త్రాలు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీనివాసుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. అందుకే శ్రీ వేంకటేశ్వరుని వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకోవడం..ఉత్తర ద్వారంలో వెళ్లడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

డిసెంబర్ 23వ తేదీని వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ ఇప్పటికే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. అరగంటలోపే ఈ ప్రత్యేక దర్శనాలను భక్తులు కొనుగులు చేశారు. సామాన్య భక్తుల కొరకు టీటీడీ ప్రత్యేక టికెట్లను రిలీజ్ చేస్తుంది. స్థానికులతోపాటుగా సామాన్య భక్తులుకు సులభతరంగా ఈ దర్శనం ఉంటుంది.

తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఎస్ఎస్డీ టైం స్లాట్ టొకెన్స్ ను డిసెంబర్ 22వ తేదీ నుంచి జారీ చేయనుంది. మొత్తం 10 రోజులకు 4,23,500 టికెట్లను జారీ చేయనుంది. 9 ప్రాంతాల్లో ఈ టోకెన్లు జారీ చేయనున్నారు. 4లక్షల టోకెన్స్ పూర్తయ్యవరకు టొకెన్స్ జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీనివాసం రెస్ట్ హౌజ్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం రెస్ట్ హౌస్, రైల్వే స్టేషన్ వెనకున్న గోవిందరాజస్వామి సత్రాలు, అలిపిరి మెట్ల మార్గం సమీపంలోని భూదేవి కాంప్లెక్స్, తుడా కార్యాలయం దగ్గరున్న ఇందిరా మైదానం, జీవనకోన లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బైరాి పట్టెడలోని రామనాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని ఉన్నత పాఠశాల, రామచంద్ర పుష్కరిణి దగ్గ టైం స్లాట్ టోకెన్స్ జారీ చేస్తారు. ఇక తిరుమల స్థానికుల కోసం సీఆర్ఓ కార్యాలయం దగ్గర జారీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: ‘మోదీ శని టీమిండియాకు తగిలింది..’ రాహుల్‌ గాంధీ సెటైర్‌తో సభలో నవ్వులు..!

#vaikunta-ekadasi-2023 #ttd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe