Free Bus Effect: ఫ్రీ బస్ ఎఫెక్ట్.. జట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.! జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు బీభత్సంగా కొట్టుకున్నారు. ఒకరినొకరు జట్టు పట్టుకుని మరి దారుణంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 01 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Free Bus Effect : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తీసుకొచ్చిన ఫ్రీ బస్సు సౌకర్యం కొట్లాటలకు దారిస్తుంది. సీట్ల కోసం మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రతి రోజు పలు చోట్ల ఇలాంటి ఘటనలు ఎక్కడొక చోట చూస్తునే ఉన్నాము. తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో లో వైరల్ గా మారింది. ఫ్రీ బస్ ఎఫెక్ట్!! జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు. pic.twitter.com/ah7wceH6vl — Telugu Scribe (@TeluguScribe) January 1, 2024 బస్సు, రైళ్లలో సీట్ల కోసం గొడవలు పడటం సహజం. ఒకరిని మరొకరు తోసుకోవడం ఇంకా ఎక్కువ అయితే కొట్టుకోవడం చాలానే జరుగుతుంటాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ లో ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు ఏకంగా జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు ఎక్కువుతున్నాయి. కొన్నిసార్లు ఆ చిన్న గొడవలు కాస్తో కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ దాడులకు దిగుతున్నారు. ఎవరైనా సర్ధి చెప్పడానికి అడ్డొచ్చిన.. వారిని కూడా వదలడం లేదు. Also Read: కల్యాణలక్ష్మి కింద తులం బంగారం.. గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఇదే గొడవ జరిగింది. సీటు విషయంలో ఇద్దరు మహిళలు భీబత్సంగా కొట్టుకున్నారు. ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం తగ్గకుండా నువ్వా..నేనా అనట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబదించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. #free-bus-effect మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి