TN Murder: తమిళనాడులో దారుణం.. కొడవళ్లతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య!

తమిళనాడు తిరుప్పూర్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారు. కొడవళ్లతో దారుణంగా నరికి చంపిన దుండగులు. మృతులు షాపు ఓనర్‌ సెంథిల్‌కుమార్‌ కుటుంబంగా గుర్తించారు. ఈ హత్య వెనుక మాజీ ఉద్యోగి వెంకటేశన్‌ ఉన్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
TN Murder: తమిళనాడులో  దారుణం.. కొడవళ్లతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య!

Ex-employee murders shop owner, family in Tamilnadu Tiruppur? :తమిళనాడు తిరుప్పూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఓ ముఠా నరికి చంపింది. పల్లడం సమీపంలోని కల్లకినరులో హోల్‌సేల్ బియ్యం దుకాణం నడుపుతున్న సెంథిల్ కుమార్ (47) అనే వ్యక్తి తన ఖాళీ స్థలంలో రాత్రి 7 గంటలకు మద్యం సేవించిన వ్యక్తులను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సెంథిల్‌(senthil)పై కొడవళ్లతో దుండగులు దాడి చేసినట్టు సమాచారం. ఇది చూసి షాక్‌ అయిన అతని కుటుంబ సభ్యులు, మోహన్‌రాజ్, రత్నాంబాల్, పుష్పవతి సెంథిల్‌ని రక్షించడానికి పరుగెత్తారు. అయితే వారిపైనా క్రూరంగా దాడి చేశారు తాగుబోతులు. దీంతో నలుగురు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.

ఇరుగుపొరుగు వారి ద్వారా సమాచారం అందుకున్న పల్లాడం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సెంథిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పల్లాడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, మరో ముగ్గురి మృతదేహాలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోలీసులను అనుమతించకపోవడంతో నిరసనకు దిగారు. కొన్నేళ్ల క్రితం సెంథిల్‌కుమార్‌ దుకాణంలో పనిచేసిన వెంకటేశన్‌ అలియాస్‌ కుట్టి ఈ హత్యలో హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతుల్లో బీజేపీ నేత:
తిరుప్పూర్ జిల్లా పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపి దుండగుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీ మేరకు స్థానికులు ఆందోళన విరమించి ముగ్గురి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక మృతుడు మోహన్‌రాజ్ బీజేపీ స్థానిక యూనిట్ ఆఫీస్ బేరర్ కావడంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై సంతాపం తెలిపారు. తమ ఇంటి దగ్గర మద్యం సేవించాలని కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పడం వల్లే హత్యకు గురయ్యామని అన్నామలై తెలిపారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సెంథిల్‌కుమార్ పల్లడం సమీపంలోని కల్లకినారు గ్రామం, పల్లడం సమీపంలోని కల్లకినారు నివాసి. కుటుంబ సమేతంగా నివాసముంటున్నాడు. ఈ క్రమంలో వారి ఇంటి సమీపంలో కొంతమంది మద్యం సేవిస్తున్నారు. సెంథిల్‌కుమార్ మద్యం తాగుతున్న వారి దగ్గరకు వెళ్లడంతోనే గొడవ జరిగిందని ఓవైపు స్థానికులు చెబుతుండగా.. మరోవైపు మాత్రం ఈ హత్య వెనుక సెంథిల్ కుమార్‌ షాప్‌లో పని చేసిన వ్యక్తి ఉందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కుటుంబాలు ఉన్నాయని, మద్యం ఉండకూడదని సెంథిల్‌ కుమార్‌ మందలించిన వెంటనే పొడిచి చంపారు. అంటే ప్లాన్‌ చేసే కత్తులు తమ వెంట తెచ్చుకున్నారని తెలుస్తోంది.

ALSO READ: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ‘బంగారం’ అంటూనే..

Advertisment
తాజా కథనాలు