E-Racing: ఈ రేసింగ్‌ ఈ సారి లేనట్టే

రకరకాల మోడళ్లలో రంగురంగుల కార్లు సాగర్‌ తీరాన రయ్యిమని దూసుకుపోయే ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ ఈ సారి జరగడం లేదు. వచ్చే యేడు భాగ్యనగరంలో జరగాల్సి ఉన్న ఈ రేసింగ్‌ను రద్దు చేసుకున్నట్టు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు.

E-Racing: ఈ రేసింగ్‌ ఈ సారి లేనట్టే
New Update

E-Racing: రకరకాల మోడళ్లలో రంగురంగుల కార్లు సాగర్‌ తీరాన రయ్యిమని దూసుకుపోయే ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ ఈ సారి జరగడం లేదు. వచ్చే యేడు భాగ్యనగరంలో జరగాల్సి ఉన్న ఈ రేసింగ్‌ను రద్దు చేసుకున్నట్టు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. గతేడాది హుస్సేన్ సాగర్ తీరంలో జరిగిన ఈవెంట్ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందగా, ఈసారి దాన్ని రద్దు చేసుకుంటున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Ind vs SA: మరో ‘సారీ!’.. మూడో రోజే ముంచేసిన సఫారీలు

గతేడాది దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ వేదికగా ఘనంగా జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హుస్సేన్ సాగర్ తీరాన దూసుకుపోయే రేసింగ్ కార్లను వీక్షించేందుకు ప్రజలతో పాటు సెలబ్రిటీలు వరుస కట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరోసారి ఈ ఈ-రేసింగ్ పోటీలకు హైదరాబాద్‌ నగరాన్ని వేదిక చేయాలని నిర్వాహకులు భావించారు.

గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంతో ఈ-ప్రిక్స్ సంస్థ ఈ మేరకు గతేడాది అక్టోబరులో ఒప్పందం కూడా కుదర్చుకుంది. సంస్థ ప్రతినిధులు డిసెంబరు ప్రారంభంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంతో సమావేశమై చర్చలు కూడా జరిపారు. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈ రేస్‌ ను కొన్ని వారాల సమయం మాత్రమే ఉందనగా రద్దు చేస్తున్నట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Upasana Konidela: ప్రతి ఆడదాని విజయం వెనుక ఆమెకు రక్షణగా ఓ మగాడు: ఉపాసన కొణిదెల!

#e-racing
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe