TDP : వైసీపీ కార్యకర్తలా గుడివాడ ఆర్వో పనిచేస్తోన్నారు.. మాజీ ఎమ్మెల్యే రావి సంచలన వ్యాఖ్యలు..!

గుడివాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే రావి. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నాని నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు వెల్లడించలేదన్నారు. వైసీపీ కార్యకర్తల ఆర్వో పని చేస్తుందని ఆరోపించారు.

New Update
TDP : వైసీపీ కార్యకర్తలా గుడివాడ ఆర్వో పనిచేస్తోన్నారు.. మాజీ ఎమ్మెల్యే రావి సంచలన వ్యాఖ్యలు..!

Former MLA Ravi : కృష్ణా జిల్లా గుడివాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే రావి. ఆర్డీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్కృటీనీలో.. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. నాని నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు వెల్లడించడం లేదన్నారు. వైసీపీ కార్యకర్తల ఆర్వో పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రావి ఆరోపించారు.

నిబంధనలకు వ్యతిరేకంగా..

కొడాలి నాని నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే..ఆర్వో కనీసం తమ వైపు కూడా చూడకుండా సంతకం పెట్టేసా అయిపోయిందంటూ సమాధానం చెప్పారన్నారు. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారంగానే.. అభ్యంతరాలు వ్యక్తం చేశామని.. అయితే వారు సమాధానం చెప్పకుండా..బయటకు పంపేస్తా అంటూ ఏకపక్షంగా మాట్లాడారన్నారు. ఆర్వో వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తమ అభ్యంతరాలపై కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే ఆర్వో.. ఎమ్మెల్యే కొడాలి నానితో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఫోన్లో సంభాషించారన్నారు. ఆ విషయాన్ని ఫిర్యాదు కూడా చేశామన్నారు.

Also Read: భర్త పై పోలీస్ కేసు పెట్టిన అనామిక.. రాజ్ నిజం బయటపెడతాడా..? కళ్యాణ్ పరిస్థితి ఏంటీ..?

వ్యక్తిగత కార్యాలయంగా..

టీడీపీ నేత తులసి బాబు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు ఓల్డ్ మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నాని తన వ్యక్తిగత కార్యాలయంగా వినియోగించుకున్నారన్నారు. కానీ ఆ విషయాలను అఫిడవిట్ లో పొందుపరచలేదన్నారు. కొడాలి నాని కార్యాలయాన్ని వినియోగించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ ధ్రువీకరించిన పత్రాన్ని మీడియాకు చూపించారు తులసిబాబు. కొడాలి నానిపై ఐదు క్రిమినల్ కేసులు ఉంటే.. మూడు కేసులు వివరాలు మాత్రమే వెల్లడించారన్నారు.. రెండు కేసుల వివరాల సమాచారాన్ని పొందుపరచలేదని పేర్కొన్నారు.

వైసీపీ కార్యకర్తలా ఆర్వో..

ఎన్నికల సంఘ నిబంధనలను కాలరాస్తూ వైసీపీ కార్యకర్తలా గుడివాడ ఆర్వో పనిచేస్తున్నారని ఆరోపించారు. కొడాలి నాని పని అయిపోయిందని.. ఓడిపోతాడని తెలిసి అధికారాన్ని అడ్డుపెట్టుకుంటూ దొంగ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. 45 రోజుల్లో ఎమ్మెల్యే దోపిడీ అంతా బయటకు తీస్తామన్నారు. ఆఖరికి మున్సిపల్ కార్మికులకు ఇచ్చే సబ్బులు.. దేవాలయాల్లో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో షాడో ఎమ్మెల్యే కమిషన్లు తీసుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు