TDP Prabhakar: పవన్ కళ్యాణ్ అనంతపురంలో పోటీ చేస్తే జరిగేది ఇదే: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

పవన్ కళ్యాణ్ అనంతపురంలో వచ్చి పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. తన భుజస్కందాల మీద మోసి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమన్నట్టుగా అరాచకం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
TDP Prabhakar: పవన్ కళ్యాణ్ అనంతపురంలో పోటీ చేస్తే జరిగేది ఇదే: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

Former MLA Prabhakar Chaudhary: తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి రెండు మూడు రోజుల్లో అకౌంట్ సెటిల్ చేస్తానని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రేపటి రోజు నారా లోకేష్ శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Also Read: జీవిత సహచరులతో ఇలా ఎప్పుడూ చేయకండి.. బంధం తెగనీయకండి!

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమన్నట్టుగా అరాచకం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా నారా లోకేష్ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగుతున్నారున్నారు. మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం వచ్చి పోటీ చేస్తే తాను భుజాన వేసుకొని పని చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఆయన స్థానంలో మరొకరు వస్తే సహకరించమని కానీ.. సహకరిస్తానని కానీ అర్థం కాదన్నారు.

Also Read: మీ చెవులు చెప్పే మాట వినండి.. ఈ తప్పులు చేయకండి.. 

దీని గురించి కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని వీరందరికీ త్వరలోనే సమాధానం చెప్తానన్నారు. అనంతపురం అర్బన్ స్థానంలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలపై త్వరలోనే అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. నేను బాధ్యతాయుతంగానే ఇప్పటి వరకు మాట్లాడానని.. బాధ్యత రహితంగా మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా చూస్తారని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు