Former Minister Narayana: వైసీపీ చేస్తోన్న అరాచక పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు మాజీ మంత్రి, నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ. రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా.. ఆయన నెల్లూరు నగరం 10వ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డివిజన్ లోని ప్రతీ ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి రాగానే.. ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే..
2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలోనే నెల్లూరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం పైపు లైన్స్ వేయడం జరిగిందన్నారు. ఈ డివిజన్‌లోని నిరుపేదలందరూ సొంత ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను అధికారంలోకి రాగానే..వీరందరికి పర్మినెంట్‌గా ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల టిడ్కో ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో 5 లక్షల ఇళ్ల వరకు మా ప్రభుత్వంలోనే పూర్తి చేయడం జరిగిందని.. వాటిని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఖచ్చితంగా 54 డివిజన్లకు సంబంధించిన నిరుపేదలందరికి 43వేల గృహాలను ఇస్తామని భరోసా ఇచ్చారు.
Also Read: జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మంచి పద్దతి కాదు..
వైసీపీ అరాచక పాలన గురించి ప్రజలందరికి తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఈ మధ్యనే మా ఆర్గనైజేషన్ లో ట్రాన్స్ పోర్ట్ లో అవినీతి జరిగిందని..సోదాలు చేసి బీభత్సవం సృష్టించారన్నారు. ట్రాన్స్ పోర్ట్ లో ప్రాబ్లం అయితే.. బస్సులు, సీ బుక్ లు..బిల్స్ చెక్ చేసుకోవాలన్నారు. కానీ..డాక్టర్లు, వ్యాపారాస్తులు, నా సన్నిహితులు, మా నేతల ఇళ్లల్లో వేకువజామున పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి దౌర్జన్యంగా సోదాలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. నారాయణ విద్యా సంస్థలకి 44 ఏళ్ల చరిత్ర ఉందని..ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేదని.. అలాంటి తాము డ్రగ్స్ అమ్ముతున్నారని అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.
అధికారులందరూ చట్టాన్ని గౌరవించాలన్నారు. చట్ట ప్రకారమే మీ పని మీరు చేయాలని..మేము కూడా చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. వాళ్లు ఏమైనా అమౌంట్ కట్టాల్సి ఉంటే నోటీసులు ఇవ్వండని.. అంతే కానీ..ఇలా సోదాలు చేసి భయపెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకి జంకనని జగన్ ప్రభుత్వాన్ని నారాయణ హెచ్చరించారు. నాయకులు చెప్పినట్లు అధికారులు ఆడొద్దన్నారు. నెల్లూరులో అన్నీ స్థానాలు టీడీపీవేనని ధీమా వ్యక్తం చేశారు.