KTR: పదవిలో ఇదే శాశ్వతం.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవులు వస్తాయి, పోతాయి..శాశ్వతం కాదు.. పదవిలో ఉన్నప్పుడు ఎంత పనిచేశారన్నదే ముఖ్యమని అన్నారు. By Jyoshna Sappogula 16 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. అనంతరం, బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. పదవులు వస్తాయి, పోతాయి, అంతేకాని శాశ్వతం కాదు.. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమని.. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. Also Read: స్కిల్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్.. క్వాష్ పిటిషన్ సీజేఐకి బదిలీ.. ఓ కవి రాసిన పాట, పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసిందని.. తెలంగాణలో లాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాలు, ట్యాంకర్ లు , ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేశానన్నారు. సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ గా రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నానన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయన్నారు. Also Read: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫిక్స్ చేసిన కాంగ్రెస్! దేశంలోనే 30 శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకం లో దేశంలోనే టాప్ 20లో 19 గ్రామాలు మనవే కావడం గొప్ప విషయమని సర్పంచ్ ల పనితీరును కొనియాడారు. పెండింగ్ బిల్లుల సమస్య పై మీ తరుపున ప్రభుత్వంతో మాట్లాడడానికి, గొంతు విప్పడానికి నేను సిద్దంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. దేశంలో చెక్ పవర్ ఉన్నది సర్పంచ్ లకు, రాష్ట్రపతికి మాత్రమే అన్నారు. #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి