AP: పాడె మోసి గురు భక్తిని చాటుకున్న మాజీ మంత్రి కాకాణి..!

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన గురుభక్తిని చాటుకున్నారు. పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన గురువు సిద్దయ్య మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

New Update
AP: పాడె మోసి గురు భక్తిని చాటుకున్న మాజీ మంత్రి  కాకాణి..!

Kakani: విద్యాబుద్ధులు నేర్పి, తనను తీర్చి దిద్దిన గురువు పాడె మోసి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన గురుభక్తిని చాటుకున్నారు. కాకాణి హైస్కూల్ విద్యను పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఆ సమయంలో సిద్దయ్య మాస్టారు ఆయనకు చదువుతోపాటు, క్రమశిక్షణ నేర్పారు. అలాగే జీవితంలో ఉపయోగపడే ఎన్నో మెళకువలను సూచించారు.

Also Read:  ‘మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చి పోతా’ పిల్లలను బెదిరించిన తండ్రి.. ఇంతలోనే ఏం జరిగిందంటే?

గత బుధవారం సిద్దయ్య మాస్టారు మృతి చెందిన విషయం తెలిసుకున్న కాకాణి వెంటనే ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలసి సందర్శించి నివాళులర్పించారు. వృత్తిరీత్యా ఇతర దేశాల్లో ఉన్న సిద్దయ్య మాస్టారు కుమారులు రావడం ఆలస్యం కావడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న కాకాణి పాడె మోశారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisment
తాజా కథనాలు