AP Skill Scam Case: డంపింగ్ యార్డ్ లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్: గంటా

ఏయూలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు బోగస్ అని వైసీపీ ఆరోపించడంతో.. కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయూ సెంటర్‌కు వెళ్ళేందుకు గంటా ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు గంటాను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

AP Skill Scam Case: డంపింగ్ యార్డ్ లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్: గంటా
New Update

ఏయూలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు బోగస్ అని వైసీపీ ఆరోపించడంతో.. కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయూ సెంటర్‌కు వెళ్ళేందుకు గంటా ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు గంటాను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఈ రోజు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యేలతో వెళ్ళి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను గంటా పరిశీలించారు.

శిక్షణ కావాలని దరఖాస్తు

ఈ సందర్భంగా విశాఖలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏయూలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ చూస్తే బాధ కలుగుతుందన్నారు. డంపింగ్ యార్డ్ లాగా చేశారని గంటా అన్నారు. రాజకీయ కక్షతో ఈ సెంటర్‌ను అభాసుపాలు చేశారని గంటా ఆరోపించారు. ఇక్కడ కలిసిన చాలా మంది విద్యార్థులు ఈ సెంటర్ వల్ల మేలు జరిగిందని చెప్పడం ఆనందం కలుగుతుందన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ కావాలని దరఖాస్తు చేసుకున్నారని మాజీ మంత్రి గంటా అన్నారు. చంద్రబాబు హయాంలో దాదాపు 13 జిల్లాలో 40 సెంటర్‌లు ప్రారంభమయ్యాయని గంటా గుర్తు చేశారు.

కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఇండియాలోనే బెస్ట్ అని ప్రచారం చేసుకున్నారని గంటా తెలిపారు. వైసీపీ తన రాజకీయాలకు ఈ సెంటర్‌ను బలి చేసిందని గంటా ఆరోపించారు. నేను ఎన్నిసార్లు ఈ సెంటర్ సందర్శించేందుకు వద్దామన్నా పోలీసులు అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు అందుకే ఆకస్మికంగా వచ్చానని అన్నారు. ఏపీలో ఉన్న 40 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో దేనికైనా వెళ్దామని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ను బోగస్ అని నిరూపించగలరా..? అని గంటా ప్రశ్నించారు. సీఎం జగన్‌ కావాలనే చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని గంటా ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని గంటా శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి రివర్స్‌ షాక్‌ తప్పదు.. తులసీరెడ్డి హెచ్చరిక

#vishaka #former-minister-ganta-srinivasa-rao #visit-to-the-skill-development-center #au
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe