Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో బాలికపై లైంగిక వేధింపుల కారణంగా మాజీ ఎమ్మెల్యే డా. సుధాకర్ (YCP Ex MLA Sudhakar) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బాధితురాలు RTVతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తనను ఐదేళ్ల పాటు అతి దారుణంగా లైంగికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం బయటకు చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ప్రభుత్వం మారింది కాబట్టి తనకు న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చానంది.
Also Read: మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..!
తన కూతురిని లైంగికంగా వేధించిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు తల్లి డిమాండ్ చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనందున కూతురిని పనిలో పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. అటు రజక సంఘాలు సైతం మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.