Forex Reserves: భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు.. వివరాలివే  

ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం మన విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు తొలిసారిగా 650 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయని ఆర్బీఐ ప్రకటించింది. 

Forex Reserves: దేశంలో రికార్డు స్థాయికి చేరిన ఫారెక్స్ నిల్వలు.. బంగారం కూడా బోలెడు ఉంది!
New Update

అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చు తగ్గుల మధ్య భారత స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గా కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ హై వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు(Forex Reserves) కూడా పెరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో విదేశీ మారక నిల్వలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు తొలిసారిగా 650 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయి.

Also Read: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ మన దేశంలో.. ఏప్పుడురావచ్చంటే.. 

భారతదేశపు విదేశీ మారకద్రవ్య నిల్వలు(Forex Reserves) ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. ఆర్బీఐ  తాజా గణాంకాల ప్రకారం (ఏప్రిల్ 5తో ముగిసిన వారానికి), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం ముగిసిన తర్వాత భారతదేశ విదేశీ మారక నిల్వలు 648.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది భారతదేశ విదేశీ మారక నిల్వల్లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి. గత వారం ట్రేడింగ్‌లో 2.98 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు(Forex Reserves) పెరిగాయి.

రెండు వారాల్లో విదేశీ మారకద్రవ్య నిల్వలు బాగా పుంజుకున్నాయి. అదేవిధంగా గత కొన్ని వారాలుగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 2024తో ముగిసిన ట్రేడింగ్ సెషన్ తర్వాత భారతీయ విదేశీ మారక నిల్వలు 645.6 బిలియన్ డాలర్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి వారంలో ట్రేడింగ్ సెషన్‌లో విదేశీ మారక నిల్వలు 2.95 బిలియన్ డాలర్లు పెరిగాయి. మొత్తం మీద కేవలం రెండు వారాల్లోనే దాదాపు 6 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు(Forex Reserves) పెరిగాయి.

విదేశీ కరెన్సీ ఆస్తులు -బంగారంలో విపరీతమైన పెరుగుదల.. 

ఆర్‌బిఐ ప్రకారం, ఏప్రిల్ 5 తో ముగిసిన ట్రేడింగ్ వారంలో, అత్యధికంగా దోహదపడిన విదేశీ కరెన్సీ ఆస్తి 549 మిలియన్ డాలర్లు పెరిగింది. ఇది కాకుండా, IMF వద్ద ఉంచిన RBI నిల్వలు కూడా ఈ కాలంలో $9 మిలియన్లు పెరిగి $4.67 బిలియన్లకు చేరుకున్నాయి.

#forex #forex-reserves
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe