/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Footware-Price-Hike.jpg)
Footwear Price Hike: ఈరోజు అంటే ఆగస్టు 1 నుంచి చెప్పులు, బూట్ల ధరలు పెరగనున్నాయి. అంతేకాకుండా, ఇకపై నాణ్యమైన పాదరక్షలు కూడా మార్కెట్లో సందడి చేస్తాయి. ప్రభుత్వం పాదరక్షల విషయంలో తీసుకువచ్చిన కొత్త క్వాలిటీ రూల్స్ ఇందుకు కారణం. అన్నిరకాల వస్తువుల క్వాలిటీ కంట్రోల్ చేసే సంస్థ BIS జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ను దేశంలోని ఫుట్ వేర్ ఇండస్ట్రీ ఫాలో కావాల్సి ఉంటుంది. బీఐఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఫుట్ వేర్ మేకర్స్ కొత్త క్వాలిటీ రూల్స్ కచ్చితంగా పాటించాలి. దీని వల్ల చెప్పులు, బూట్ల తయారీ ఖర్చు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
ఫుట్ వేర్ తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థం నిర్దిష్ట నాణ్యతతో ఉండాలి. ఈ మెటీరియల్ నాణ్యత IS 6721 -IS 10702 ప్రమాణాల ప్రకారం ఉండాలి. వీటికి కఠినమైన క్వాలిటీ టెస్ట్స్ నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం మార్కెట్ నుండి నాణ్యత లేని పాదరక్షలను తొలగించడం.
పాత బూట్లు ఏమవుతాయి?
Footwear Price Hike: ఇక నుంచి మార్కెట్‌లోకి వచ్చే ఫుట్ వేర్ బీఐఎస్ ప్రమాణాన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫుట్ వేర్ ఎకౌంట్స్ బీఐఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పాత షూలను పాత ధరకే విక్రయించేందుకు కొంత టైం ఇచ్చారు.
బూట్లు, చెప్పుల ధరలు పెరగనున్నాయి...
పాదరక్షల తయారీకి అవసరమైన ముడిసరుకు, దాని తయారీ ప్రక్రియ - ఉత్పత్తి మొత్తం నాణ్యత, ఇవన్నీ తప్పనిసరిగా BIS ప్రమాణాలకు లోబడి ఉండాలి. దీంతో సహజంగానే మాన్యుఫాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. దాంతో ఫుట్ వేర్ ధరలు కూడా పెరుగుతాయి. మార్చిన BIS నిబంధనలలో మొత్తం 46 ఫుట్ వేర్ ప్రోడక్ట్స్ ను చేర్చారు.
చిన్న కంపెనీలకు మినహాయింపు...
Footwear Price Hike: కొత్త BIS నియమాలు చిన్న మాన్యుఫాక్చరర్స్ ను కవర్ చేయవు. రూ. 50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన ఫుట్ వేర్ మాన్యుఫాక్చరర్స్ ఈ BIS ప్రామాణిక నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
అదండీ విషయం ఇక చెప్పులు కొనుక్కోవాలన్నా.. బూట్లు కొనుక్కోవాలన్నా.. పర్స్ బరువు చెక్ చేసుకోవాల్సిందే అన్నమాట.