Blood Pressure: జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు రక్త పోటు సమస్య పై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. రక్తపోటు ఉన్న వారు వాళ్ళు రోజూ తినే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ సమస్య పై మంచి ప్రభావం చూపుతాయి. చాలా మంది ఎక్కువగా మెడికేషన్ పై మాత్రమే దృష్టి పెడతారు కానీ మంచి ఆహారంతో కూడా ఈ సమస్యను సహజంగా నియంత్రించవచ్చు.
రక్త పోటు ఉన్నవారు మీ డైట్ లో ఆహారాలు తీసుకోండి
ఆకుకూరలు
ఆకుకూరల్లో రక్త పోటును నిర్వహించే నైట్రేట్స్ తో పాటు పుష్కలమైన పోషకాహారలు ఉంటాయి. వైద్య నిపుణుల నివేదిక ప్రకారం ప్రతీ రోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకుంటే రక్తపోటు తగ్గించడానికి సహాయపడును. ఉదాహరణకు క్యాబేజీ, పాలకూర, బెండకాయ
బెర్రీస్
బెర్రీస్ లోని యాంటీ ఆక్సిడంట్స్, ఫ్లేవనాయిడ్స్ రక్త ప్రసరణను మెరుగు పరిచి రక్త పోటు ప్రమాదాన్ని తగ్గించును. వీటిలోని నైట్రిక్ ఆక్సైడ్ రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. కానీ కేవలం 28 గ్రాముల కంటే తక్కువ మాత్రమే తీసుకోవాలి.
అరటి పండు
అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకుంటే శరీరంలో రక్త పోటు సమస్యను తగ్గించును. అధిక రక్త పాటు, పొటాషియం లోపం ఉన్న వారికి ఇవి మంచి ప్రభావం చూపుతాయి.
ఓట్స్
ఓట్స్ లో బీటా గ్లుకాన్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతుంది. అంతే కాదు రక్తపోటు సమస్యను కూడా నియంత్రించడంలో సహాయపడినని నిపుణులు చెబుతున్నారు.