Blood Circulation: రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలంటే.. ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చండి. ట్యూనా ఫిష్, సిట్రస్ ఫ్రూట్స్, ఆనియన్, గార్లిక్, నట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్ రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తాయి. By Archana 09 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Blood Circulation: శరీరంలో ప్రతీ ఆర్గాన్ సరిగ్గా పని చేయాలంటే.. అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలి. రక్తప్రసరణ సరిగ్గా ఉంటేనే అన్ని అవయవాలకు రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా అందుతుంది. అంతే కాదు మెదడు చురుగ్గా పనిచేయడానికి, గుండె ఆరోగ్యం కోసం మెరుగైన రక్తప్రసరణ తప్పనిసరి. అందుకే శరీరంలో రక్తప్రసరణను పెంచే ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవేంటో చూడండి. రక్తప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు ట్యూనా ఫిష్ శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఇవి రక్త నాళాలలో బ్లడ్ ఫ్లో ఈజీగా జరగడానికి సహాయపడతాయి. అంతే కాదు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి. అలాగే శరీరంలో బ్లడ్ క్లాటింగ్ సమస్యలను నియంత్రించును. అందుకే మీ డైట్ లో ట్యూనా, ఫ్రెష్ వాటర్ ఫిష్ చేర్చితే మంచి ప్రభావం ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరానికి చాలా అవసరం. ఇది రక్తంలో బ్లడ్ క్లాట్స్ నియంత్రించి.. రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. సిట్రిక్ యాసిడ్ అధికంగా లభించే ఆహారాలను మీ డైట్ లో చేర్చండి. గూస్ బెర్రీస్, ఆరెంజ్స్, గ్రేప్స్, లెమాన్స్, ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. Also Read: Eating Banana: ఉదయాన్నే బనానా తింటున్నారా.. అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..! నట్స్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వీటిలోని మెగ్నీషియం, అర్జినైన్, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అర్జినైన్ రక్తనాళాలను వెడల్పు చేసి.. బ్లడ్ ఫ్లో ఈజీగా జరిగేలా చేస్తుంది. బాదం, పిస్తా, వాల్నట్స్ ఆహారంలో తీసుకుంటే మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. వెల్లుల్లి వెల్లుల్లి శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని సల్ఫర్ గుణాలు రక్తపోటును తగ్గించి.. రక్త నాళాలను రిలాక్స్ చేస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఉల్లిపాయ ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్, రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి తోడ్పడతాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు డైలీ డైట్ లో వీటిని తీసుకుంటే రక్తప్రసరణ మెరుగ్గా జరిగి.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. Also Read: Worst Foods: ప్రపంచంలో టాప్-10 చెత్త ఫుడ్ ఐటెమ్స్.. లిస్ట్‌లో భారతీయ వంటకాలు కూడా! #foods-to-improve-blood-circulation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి