Thyroid: మీకు థైరాయిడ్ ఉందా .. అయితే ఇవి తప్పక తెలుసుకోండి

ఈ మధ్య కాలం చాలా మంది థైరాయిడ్ తో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు రోజూ తినే ఆహారాల పై దృష్టి పెడితే సరిపోతుంది. బెర్రీస్, అవకాడో, మిల్క్ ప్రాడక్ట్స్, ఫైబర్ ఫుడ్స్, థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణుల చెబుతున్నారు.

New Update
Thyroid: మీకు థైరాయిడ్ ఉందా .. అయితే ఇవి తప్పక తెలుసుకోండి

Thyroid: మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం వంటి జీవన శైలి సమస్యలు ఈ మధ్య కాలం చాలా మందిలో తరుచుగా కనిపిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ అన్ని వయసుల వారు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో ఎక్కువగా బాధిస్తున్న సమస్యల్లో ఒకటి థైరాయిడ్. జీవన శైలి, ఆహారపు అలవాట్లు వీటిని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు తినే ఆహారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కావున థైరాయిడ్ సమస్య ఉన్న వారు డైలీ డైట్ లో ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. అంతే కాదు ఇవి థైరాయిడ్ ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవల్సిన ఆహారాలు

ఫైబర్ రిచ్ ఫుడ్స్

సాధారణంగా థైరాయిడ్ ఉన్నవారిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాదు వీరిలో జీర్ణక్రియ కూడా నెమ్మదిగా ఉంటుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అధిక ఫైబర్ జీర్ణక్రియను సులువు చేసి.. మల బద్ధకాన్ని తగ్గిస్తాయి. ఆకుకూరలు, పండ్లు, చిక్కుళ్ళు, ఎక్కువగా తినాలి.

డైరీ ప్రాడక్ట్స్

మిల్క్, చీజ్, పెరుగు థైరాయిడ్ సమస్య ఉన్నవారికి మంచి లాభాలను ఇస్తాయి. వీటిలో అయోడిన్ మినరల్ కంటెంట్ థైరాయిడ్ గ్రందుల పని తీరుకు సహాయపడతాయి. అలాగే శరీరంలో పోషక విలువలను పెంచి సమస్యను తగ్గిస్తుంది. అందుకే రోజూ తినే ఆహారంలో ఇవి ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవడం మంచిది.

publive-image

బ్లూ బెర్రీస్

సహజంగా బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లూ బెర్రీస్, స్త్రా బెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటివి మీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ హైపో థైరాయిడిజం సమస్యను పెంచే ఫ్రీ రాడికల్స్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

అవకాడో

దీనిలో ఫైటో న్యూట్రియెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు అవకాడో లోని పొటాషియం ఇతర పోషకాలు శరీరంలో షుగర్ లెవెల్స్ హార్మోనల్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తాయి. ఇది థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పని చేయడానికి తోడ్పడుతుండ్.

చెర్రీ

చేర్రీస్ లో యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్లాండ్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. డైలీ డైట్ లో వీటిని తీసుకుంటే ఈ సమస్య పై మంచి ప్రభావం చూపుతుంది.

Also Read: Fridge Items: ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు