Eggs: గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక గుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి. తక్కువ ధరకు దొరికే బెస్ట్ హెల్తీ ఫుడ్‌లో గుడ్డును మించింది లేదు. ఉడకబెట్టిన గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అవసరానికి మించి ఏదైనా తినడం ప్రమాదకరం. అందువల్ల, గుడ్లను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.. అంతేకాదు గుడ్డుతో కలిపి తినకూడదని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
పాలు
గుడ్లు- పాల మిశ్రమం రెండు ప్రోటీన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. జీర్ణ క్రియ అసౌకర్యానికి కారణమవుతుంది.
సిట్రస్ పండ్లు
నారింజ లేదా ద్రాక్ష లాంటి అధిక ఆమ్ల పండ్లతో గుడ్లను కలిపినప్పుడు.. వాటి రుచి అసహ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రెండింటిని కలిపి తినకూడదు.
అధిక చక్కెర ఆహారం
స్వీట్లు లేదా చక్కెర పేస్ట్రీలు లాంటి అధిక చక్కెర ఆహారాలతో గుడ్లు తినడం మానుకోండి. ఈ కలయిక రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరగడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది.
Also Read: Fridge Items: ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!
బీన్స్
బీన్స్‌లో జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే లెక్టిన్స్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. దీనిని గుడ్లుతో కలిపి తీసుకోవడం వల్ల కొంతమందిలో పేగు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
సోయా మిల్క్
సోయా, గుడ్డు రెండింటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కావున వీటిని కలిపి తీసుకుంటే శరీరంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగి అది విషపూరితం అవ్వడానికి కారణమవుతుంది.
అరటిపండ్లు
గుడ్డును అరటిపండుతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అంతే కాదు వీటి కలయిక కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కలిగించే ప్రమాదం ఉంది.
Also Read: Health Tips: ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి!