Fridge Items: ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!

అన్ని ఆహారాలను శీతలీకరించాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రతి పండును, కూరగాయను ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఆలుగడ్డ, వంకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, అవోకాడోస్, అరటిపండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.

New Update
Fridge Items: ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!

Fridge Items: కొంతమంది ఇళ్లలో ఫ్రిడ్జ్‌ను ఓపెన్ చేయాలంటేనే భయమేస్తది. ఎందుకంటే అది ఫ్రిడ్జ్‌లా ఉండదు.. గార్బెజ్‌లా ఉంటంది. డంపింగ్‌ యార్డ్‌లా ఏది పడితే అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పడేస్తుంటారు. అసలు ఖాళీనే ఉంచరు. ఇలా ఫ్రిడ్జ్‌లో ఏది పడితే అది పెట్టి.. వాటిని తర్వాత తింటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని కొన్ని పదార్థాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

అరటిపండ్లు

అరటిపండ్లను ఎక్కడో ఒక చోట బహిరంగ ప్రదేశంలో ఉంచడం మంచిది. అంతేకాని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. దీని వల్ల కొన్ని పోషకాలు కోల్పోవడమే కాకుండా వాటి రుచి కూడా తగ్గిపోతుంది.

అవోకాడోస్

అవకాడొలు కచ్చగా ఉన్నప్పుడు వాటిని ఫ్రిడ్జ్ లో పెడితే.. రైపెనింగ్ ప్రాసెస్ నెమ్మదిగా జరగడానికి కారణమవుతుంది. అందుకే వాటిని పొడి ప్రదేశంలో ఉంచాలి. కానీ మళ్ళి అవకాడో పండిన తర్వాత ఎక్కువ కాలం ఉండడానికి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

పుచ్చకాయ

పుచ్చకాయను ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. దీని వల్ల దానిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తాయి. ఆ తర్వాత వీటిని తింటే ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఫ్రెష్ గా ఉన్నప్పుడే తినాలి.

publive-image
స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలను రిఫ్రిజిరేటర్లో ఉంచినప్పుడు, వాటి తీపిదనం పోతుంది. నిజానికి స్ట్రాబెర్రీలు కొన్న వెంటనే తినడం మంచిది. వీటిని రూమ్ టెంపరేచర్ లో ఉంచితే సరిపోతుంది.

ఆరెంజ్
సిట్రస్ పండ్లను చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేసినప్పుడు చెడిపోతాయి. అందుకే నారింజ పండ్లను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల వారి చర్మం డల్ గా మారుతుంది.

వంకాయ

వంకాయను 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం వల్ల దాని ఆకృతి చెడిపోవడమే కాకుండా రుచి లేకుండా ఉంటుంది. ఒకవేల వంకాయను ఫ్రిడ్జ్ లో పెడితే వాటిని ఏదైనా కవర్ లో ర్యాప్ చేసి పెట్టాలి.

ఆలుగడ్డ

బంగాళాదుంపలను పొడి ప్రదేశంలో ఉంచితేనే రుచిగా ఉంటుంది. ఆలుగడ్డను ఫ్రిడ్జ్ లో పెడితే వాటిలో స్టార్చ్ కంటెంట్ షుగర్ లా మారిపోతుంది. ఇది బంగాళాదుంపకు తియ్యని ఫ్లేవర్ వచ్చేలా చేస్తుంది.

Also Read: Wooden : చెక్క పాత్రలు జిడ్డుగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు