Happy Hormones: శరీరంలో హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తికి .. ఈ ఆహారాలు తినండి

మానసిక స్థితి, ప్రవర్తనను శరీరంలో విడుదలయ్యే హార్మోన్స్ ప్రభావితం చేస్తాయి. వీటినే హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఇవి లోపించిన వారిలో ఆందోళన, నిరాశ కనిపిస్తాయి. ఈ హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి ఈ ఆహారాలు తోడ్పడతాయి. డార్క్ చాక్లెట్, బనాన, బెర్రీస్, సాల్మన్ ఫిష్ లీఫీ గ్రీన్స్.

New Update
Happy Hormones: శరీరంలో హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తికి .. ఈ ఆహారాలు తినండి

Happy Hormones: వైద్య నిపుణుల నివేదికల ప్రకారం మనిషి ప్రవర్తన, భావోద్వేగాలు శరీరంలో విడుదలయ్యే హార్మోన్స్ పై ఆధారపడి ఉంటాయి. కోపం, బాధ, నిరాశ, సంతోషం కలిగించడంలో హార్మోన్స్ మ్యుఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఇవి నాలుగు రకాలు.. సెరోటోనిన్, ఎండార్ఫిన్, డోపామైన్, ఆక్సిటోసిన్. శరీరంలో వీటి ఉత్పత్తి లోపించినప్పుడు కోపం, చిరాకు, ఒత్తిడి, ఆందోళను వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి ఈ ఆహారాలు తీసుకుంటే మంచి ప్రభావం ఉంటుంది. ఇవి సంతోషకరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి.

హ్యాపీ హార్మోన్లను ప్రేరేపించే ఆహారాలు

డార్క్ చాక్లెట్

డార్క్ చాకోలెట్స్ లోని కోకో కంటెంట్ శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది హ్యాపీగా ఉంచుతుంది. అలాగే దీనిలోని మెగ్నీషియం మినరల్ కంటెంట్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

publive-image

బననా

సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తికి బననాలోని విటమిన్ B6 చాలా మ్యుఖ్యం. మన డైట్ బననా తీసుకోవడం చేత హ్యాపీ మూడ్ కలిగించడానికి బాగా పనిచేస్తుంది. అలాగే మానసిక స్థితి, ప్రవర్తన పై కూడా మంచి ప్రభావం చూపుతుంది.

Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

ఆకుకూరలు

ఆకుకూరల్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి.. శరీరంలో హ్యాపీ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కొంత మంది ఆకుకూరలు ఇష్టపడరు. కానీ వీటిని తింటే ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం.

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ విడుదలకు సహాయపడతాయి. ఇది సంతోషకరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది.

publive-image

బ్లూ బెర్రీస్

వీటిలోని పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మానసిక ఒత్తిడి కారణంగా కలిగే సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇవి మనసును ప్రశాంతగా ఉంచడంతో పాటు సంతోషమైన భావాలను కలిగిస్తాయి.

publive-image

Also Read: Back Acne: వీపు, బాడీ పై పింపుల్స్ వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!

Advertisment
తాజా కథనాలు