Migraine: ఈ ఆహారాలతో మైగ్రేన్ నొప్పికి చెక్ పెట్టండి

తలనొప్పి చాలా రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి మైగ్రేన్. ఈ సమస్యతో బాధపడేవారు ఈ ఆహారాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బనాన, పుచ్చకాయ, ఫ్లాక్స్ సీడ్స్, హెర్బల్ టీ, కాఫీ, డార్క్ చాక్లెట్, పెరుగు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

New Update
Migraine: ఈ ఆహారాలతో మైగ్రేన్ నొప్పికి చెక్ పెట్టండి

Migraine: తల నొప్పి చాలా కారణాల చేత వస్తుంది. తల భాగం మొత్తం నొప్పిగా ఉంటే దానికి కారణం టెన్షన్, ఒత్తిడి. ఒక వైపు మాత్రమే విపరీతమైన నొప్పి ఉంటే దాన్ని మైగ్రేన్ అంటారు. అయితే కొంత మందిలో ఈ మైగ్రేన్ నొప్పి తట్టుకోలేనంతగా ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి,ఆల్కహాల్, ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోవడం దీనికి ముఖ్య కారణాలు. మైగ్రేన్ సమస్య ఉన్నవారు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మైగ్రేన్ నొప్పిని తగ్గించే ఆహారాలు

కాఫీ

చాలా మందికి తల నొప్పిగా ఉన్నప్పుడు కాఫీ లేదా టీ తీసుకోవడం అలవాటు. కాఫీలోని కెఫిన్ గుణాలు మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ కెఫిన్ కంటెంట్ మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలోని థియోబ్రోమిన్, కెఫిన్ అనే కాంపౌండ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

బెర్రీస్

వీటిలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Also Read: Cholesterol Friendly Veggies: అధిక కొలెస్ట్రాల్ కు.. ఈ కూరగాయలతో చెక్ పెట్టండి

publive-image

పెరుగు

శరీరంలో క్యాల్షియం లెవెల్స్ తగ్గడం తలనొప్పికి కారణమవుతుంది. క్యాల్షియం పుష్కలంగా కలిగిన పెరుగు, కాలే వంటి ఆహారాలు తీసుకోవాలి. అలాగే పెరుగులో మైగ్రేన్-తగ్గించే B విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి .

అవిసె, గుమ్మడి గింజలు

వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం మైగ్రేన్ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి సహాపడుతుంది.

అరటి పండు

సాధారణంగా అరటిపండును స్ట్రెస్ బస్టర్ అని పిలుస్తారు. దీనిలోని మెగ్నీషియం కంటెంట్ మైగ్రేన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డైలీ డైట్ లో రోజూ ఒక అరటిపండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

పుచ్చకాయ

డీహైడ్రేషన్ కారణంగా కూడా విపరీతమైన తల నొప్పి వస్తుంది. పుచ్చకాయలో అధిక నీటి శాతం తల నొప్పిని తగ్గించడానికి సహాయపడును.

Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

Advertisment
తాజా కథనాలు