మీ స్మార్ట్ పోన్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

చేతిలో స్మార్ట్ ఫోన్లు లేకుండా తిరిగే వాళ్ళు ఉండరు..మణీ చెల్లింపులు మొదలు, గేమింగ్ వరకు అన్నింటికీ ఇంటర్‌నెట్ అవసరం దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్‌ తగ్గడం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది..అసలు ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్ ఎందుకు తగ్గుతుంది?

New Update
మీ స్మార్ట్ పోన్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

ఇంట్లో ఎంత మంది వుంటే అంత మంది కూడా స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.. ఇక నెట్ లేకుండా మాత్రం అస్సలు ఉండరు.. ఇంటర్‌నెట్‌ రేట్స్‌ తగ్గడం, అందరికీ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్‌నెను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది.చేతిలో స్మార్ట్ ఫోన్లు లేకుండా తిరిగే వాళ్ళు ఉండరు..మణీ చెల్లింపులు మొదలు, గేమింగ్ వరకు అన్నింటికీ ఇంటర్‌నెట్ అవసరం అనివార్యంగా మారడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్‌ తగ్గడం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది..అసలు ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్ ఎందుకు తగ్గుతుంది?..ఎలా స్పీడ్ ను పెంచాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. స్పీడ్ పెంచుకోవాలంటే యాక్సెస్‌ పాయింట్ నెట్‌వర్క్‌ సెట్టింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌లో ఏపీఎన్‌లోకి వెళ్లి డీఫాల్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

2. ఇక సోషల్‌ మీడియా యాప్స్‌లో ఆటోప్లే వీడియో మోడ్‌ వల్ల కూడా ఇంటర్‌నెట్ స్పీ్డ్‌ తగ్గుతుంది. అంటే మీరు యాప్‌ను ఓపెన్‌ చేయకపోయినా అందులోని వీడియోలకు నెట్ ఉపయోగించుకుంటూనే ఉంటాయి. కాబట్టి ఆటో ప్లే వీడియో మోడ్‌ను ఆఫ్‌ చేసుకోవాలి.

3. మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం 4జీ లేదా ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు అన్నీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి..అందులో దాదాపు 4జి నెట్‌వర్క్‌ ఉంటుంది..

4.ఇంటర్‌ నెట్‌ స్పీడ్‌ పెంచుకోవడానికి ఉన్న మరో మార్గం బ్రౌజర్‌లో డేటా సేవ్ మోడ్‌ను సెట్ చేసుకోవడం.. ఇలా చెయ్యడం వల్ల నెట్ స్పీడ్ పెరుగుతుంది.. ఈ టిప్స్ తప్పక ఫాలో అవ్వండి.. నెట్ స్పీడ్‌ ఆటోమాటిక్‌గా పెరుగుతుంది..

Advertisment
Advertisment
తాజా కథనాలు