Anger Tips: ఈ చిట్కాలతో కోపాన్ని కంట్రోల్ చేసేయండి!

తన కోపమే తనకి శత్రువు అంటుంటారు పెద్దలు.ఈ కోపంలో ఏవేవో చేసి తర్వాత బాధపడతారు. కోపం వల్ల వచ్చే నష్టాన్ని వారు కూడా భరిస్తారు. అలాంటప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక బాధపడతారు. అలా కాకుండా, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

New Update
Anger Tips: ఈ చిట్కాలతో కోపాన్ని కంట్రోల్ చేసేయండి!

How to Control Anger: కోపం అనేది మీ శత్రువు. కొన్ని సందర్భాల్లో బంధాన్ని కూడా దూరం చేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే జీవితంలో చాలా ముందుకు వెళ్లొచ్చు. దానిని తగ్గించుకునేందుకు మీకోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1. కోపం వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే వెళ్లే గ్లాసుడు నీళ్లు (Water) తాగేయాలి. నీళ్లు శరీరంలోకి చేరాక కోపం వచ్చే లక్షణాలను తగ్గిస్తాయి.

2. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలపై ఫోకస్ చేయండి. అలా చేయడం వల్ల మీరు వెంటనే రియాక్ట్ అవ్వరు.

3. కోపంగా రియాక్ట్ అవ్వకుండా ఒకటితో మొదలెట్టి ఆగ్రహం బయటకు రాకుండా ఉండేలా లెక్కపెడుతూనే ఉండండి. ఒక్కోసారి వంద అంకెలు కూడా లెక్కపెట్టాల్సి ఉంటుంది.

Also Read: వంటగదిలో బొద్దింకల బాధ ఎక్కువైందా.. ఇలా చేయండి

4. గొడవకు కారణమయ్యే సంభాషణ ఇంట్లో అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరే డైవర్ట్ చేసుకోండి. మీకు ఇష్టమైన పనిచేసుకోండి. వంట చేయడం, డ్యాన్స్... ఇలా. మీకు అమితంగా ఇష్టపడే అంశాల గురించి ఆలోచించడం మొదలుపెట్టండి.

5. కోపం ఎందుకు వస్తుందో ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోండి.  తరచూ చిన్నచిన్న విషయాలకే వస్తుంటే యోగా, ధ్యానం చేసుకోవాలి.

6. మీకు ఒకే వ్యక్తితో తరచూ గొడవ అవుతుంటే... ఆ వ్యక్తిని మీరు మార్చలేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోప్పడినా, గొడవపడినా ఫలితం లేనప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేదనే భావన మీలో నాటుకుపోవాలి. అలా అయితే ఆ వ్యక్తి మీమీద అరిచినా మీకు వెంటనే రాదు... ‘వీడింతే’ అనుకుని వెళ్లిపోతారు.

7. ఇక భరించలేనంతగా ఇరిటేట్ చేస్తుంటే అక్కడ్నించి మీరు వెళ్లిపోవడం ఉత్తమం.

8. ఇంట్లోనే వ్యక్తే నిత్యం ఇరిటేట్ చేస్తుంటే పట్టించుకోవడం మానేయాలి. మీ పని మీరు చేసుకుని పోవాలి తప్ప, వారు అనే మాటలు వినడం, వాటికి సమాధానం ఇవ్వడం చేయకూడదు. అవసరమైతే తప్ప నోరు విప్పకూడదు.

Advertisment
తాజా కథనాలు