Alcohol Tips: ఆల్కహాల్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఆరోగ్యం పాడైనట్లే ఆరోగ్యం పై ఆల్కహాల్ ప్రభావం తగ్గించడానికి ఈ జాగ్రత్తలు పాటించండి. ఆల్కహాల్ తీసుకునే ముందు ఏదైనా ఫుడ్ తినడం, నీళ్లు బాగా తాగడం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం పై ఆల్కహాల్ ప్రభావం తక్కువగా ఉంటుంది. By Archana 04 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Alcohol Tips: ఏదైన అకేషన్, లేదా పార్టీ, ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు హ్యాపీ మూడ్ లో ఆల్కహాల్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దాని వల్ల కలిగే అనారోగ్య సమస్యల పై కూడా బాధ్యతగా ఉండాలి. మద్యపానం తీసుకునే ముందు తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే ఆల్కహాల్ ప్రభావం ఆరోగ్యం పై తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా ఉండదు. ఆరోగ్యం పై ఆల్కహాల్ ప్రభావం తగ్గించడానికి ఇలా చేయండి ఆల్కహాల్ తీసుకునే ముందు ఆహరం తినాలి ముఖ్యంగా ఎంప్టీ స్టమక్ తో ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. తాగేముందు ఏదైనా ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకుంటే.. శరీరంలో త్వరగా ప్రాసెస్ అయ్యి.. ఆరోగ్యం పై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. త్రాగడానికి ముందు ఫుడ్ తీసుకుంటే.. శరీరంలో ఆల్కహాల్ శోషణ నెమ్మదిగా ఉంటుంది. మెల్లిగా తాగాలి ఆల్కహాల్ తీసుకునే ముందు ఎంత ప్రాధాన్యమో.. తాగేటప్పుడు నెమ్మదిగా తాగడం కూడా అంతే ముఖ్యం. ఇలా చేస్తే శరీరం ఆల్కహాల్ ను విచ్ఛిన్నం చేయడం ఈజీగా ఉంటుంది. అదే పనిగా.. స్పీడ్ గా తాగితే దాన్ని ప్రాసెస్ చేయడానికి శరీరానికి కష్టమవుతుంది. నీళ్లు బాగా తీసుకోవాలి మద్యపానం సేవించే ముందు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. సాధారణంగా ఆల్కహాల్ శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది. ఇది హ్యాంగ్ ఓవర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.. దీని వల్ల శరీరం పై ఆల్కహాల్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అధిక ఆల్కహాల్ తీసుకోవడం యురినేషన్ సమస్యను ఎక్కువ చేస్తుంది. దీని వల్ల శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది బలహీనత, అలసట, వికారం సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యను తగ్గించడానికి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలు.. అరటి పండు, కివి, ఆకుకూరలు, ఆప్రికాట్, మస్రూమ్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నింటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సరైన నిద్ర ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగ్ ఓవర్ తగ్గాలంటే సరైన నిద్ర తప్పనిసరి. మద్యం సేవించిన తర్వాత మగతగా, కొన్ని సార్లు తలనొప్పిగా కూడా ఉంటుంది. ఇవి తగ్గించడానికి కాఫీ వంటి కెఫిన్ కలిగిన డ్రింక్స్ తీసుకోవడం వృధా. హ్యాంగ్ ఓవర్ నుంచి తిరిగి యాక్టీవ్ గా అవ్వాలంటే సరైన నిద్ర బెస్ట్ సొల్యూషన్. Also Read: Cashew: ఈ సమస్యలు ఉంటే జీడి పప్పుకు దూరంగా ఉండండి.. లేకపోతే అంతే సంగతి! #tips-to-reduce-alcohol-effects-on-health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి