లోకేశ్‌ పాదయాత్ర వేళ వైసీపీ వర్సెస్‌ టీడీపీ ఫ్లెక్సీ ఫైట్‌..!

విజయవాడలో ఫ్లెక్సీ వార్‌ అంతకంతకూ ముదురుతోంది. రేపు (ఆగస్టు 19) నారా లోకేశ్‌ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇస్తుండడంతో రాజకీయం వేడెక్కింది. నారా లోకేశ్‌ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకులకు భయపడి అధికారులు ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందని విమర్శించారు.

New Update
లోకేశ్‌ పాదయాత్ర వేళ వైసీపీ వర్సెస్‌ టీడీపీ ఫ్లెక్సీ ఫైట్‌..!

Nara lokesh Padha Yatra: రేపు (ఆగస్టు 19) టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇస్తుండగా రాజకీయం రంజుగా మారింది. లోకేశ్‌ ఫ్లెక్సీలకు అనుమతించేదే లేదంటున్నారు పోలీసులు. విజయవాడలో ఫ్లెక్సీలకి అనుమతి లేదని కార్పొరేషన్ కమిషనర్ మెమో జారీ చేశారు. లోకేశ్‌ పాదయాత్ర వేళ నాలుగు రోజుల పాటు ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్‌లకు అనుమతి నిరాకరిస్తున్నాడు. లోకేశ్‌ పాదయాత్ర కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం అనుమతి కోరుతూ అప్లై చేశారు టీడీపీ కార్పొరేటర్లు.

సీఎం జగన్‌తో అవినాష్ భేటీ మరుక్షణమే మెమో విడుదలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీపై టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు.

బుద్దా వెంకన్న ఏం అన్నారంటే?

⦾ వైసీపీ నాయకులకు భయపడి అధికారులు ఫ్లెక్సీలు తొలగించారు.

⦾ ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది.

⦾ దమ్ముంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి ఫ్లెక్సీలపై చేయి వేయండి.. మీ సంగతి చూస్తాం.

⦾ విజయవాడలో టీడీపీ బ్యానర్ కనపడకూడదు అంట.

⦾ మేము పెట్రోలింగ్ చేస్తాం లోకేశ్‌ వెళ్లే వరకు పెట్రోలింగ్ చేస్తూ ఉంటాం

⦾ మా సహనాన్ని పరీక్షయించవద్దు

⦾ ఏ అధికారి అయినా లోకేశ్‌ వెళ్లే వరకు ఫ్లెక్సీ జోలికి వస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.

⦾ జగన్ మోహన్ రెడ్డి వచ్చినపుడు మేము ఎక్కడా కూడా ఫ్లెక్సీలను తొలగించలేదు కదా?

⦾ జగన్‌ రాజ్యాంగంలో ఫ్లెక్సీలను తొలగించాలని రాసి ఉందా?

⦾ లోకేశ్‌ వచ్చినప్పుడు ఫ్లెక్సీలు తొలగించాలని రాజ్యాంగంలో పెట్టారా?

ఆగస్టు 22న నారా లోకేశ్‌ ప్రసంగం:
ఆగస్టు 22న గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. గన్నవరం సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చిన అవుటపల్లిలో సభ జరగనుంది. కృష్ణా జిల్లా టీడీపీ నాయకత్వం సభా వేదికను ఖరారు చేసి ఏర్పాట్లను ప్రారంభించింది. కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు , ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు గ్రౌండ్‌ లెవలింగ్‌ పనులను సందర్శించారు. తర్వాత ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ.. బెదిరింపులు ఎదురైనా నారా లోకేశ్‌ బహిరంగ సభ నిర్వహణకు పార్టీ కార్యకర్తలు ముందుకు వచ్చానన్నారు. గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని విమర్శించారు. లోకేశ్‌ బహిరంగ సభను చెడగొట్టేందుకు అధికార వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లోకేశ్‌ పర్యటన షెడ్యూల్‌ను కొనకళ్ల నారాయణరావు వివరిస్తూ ఆగస్టు 21న నిడమనూరులో గన్నవరం నియోజకవర్గానికి లోకేష్ యువగళం పాదయాత్ర వస్తుందని తెలిపారు. తర్వాత పాదయాత్ర గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం మీదుగా చిన అవుటపల్లికి చేరుకుంటుందని తెలిపారు. బహిరంగ సభ పూర్తయిన తర్వాత యువగళం పాదయాత్ర నూజివీడు నియోజకవర్గానికి చేరుకుంటుంది. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్తుందని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు