Shiva Puja: హిందూ సంప్రదాయంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి దేవునికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ పూజల్లో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా కొందరు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో శివ పూజ ఒకటి. శివునికి సోమవారం ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజు శివుని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందని నమ్ముతారు. అయితే పూజలు చేసే విధానాలు కొన్ని ఉంటాయి. వాటిని ఆ విధంగా చేస్తేనే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఐదు పూజలు శివాలయంలో చేసే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
శివున్ని పూజించే విధానం:
- ఐదు పూజలు శివాలయంలో చేసిన వారికి జీవితంలో తిరుగు ఉండదట. అంతేకాదు అలాంటి వారికి పునర్జన్మ కూడా ఉంటుదని చెబుతున్నారు.
మొట్టమొదటి పూజ: ఆవాహన.. శివుడు దగ్గరికి వెళ్ళగానే ఇలా రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనాలి. - రెండవ పూజ ధ్యానం: శివుడికి సంబంధించిన ఏదో ఒక శ్లోకం భక్తితో చదవాలి. మీరు ఏ ఆలయానికి వె ళ్లినా దేవుణ్ణి స్తోత్రం చేయాలి. స్తోత్రం చాలా గొప్పది. భగవంతుని వర్ణించే అటువంటి కవిత్వమునకు ధ్యానమని పేరు ఉంది. ఆ ధ్యానంలో శ్లోకాలు చాలా గొప్పగా ఉన్నాయి . అందులో ముఖ్యంగా శివుడికి వందే శంభు ఉమాపతి అనే ఒక శ్లోకం అంటే చాలా ఇష్టం. గుళ్లోకి వెళ్లి వెంటనే ఇలా ధ్యానం చేయాటం వల్ల ఈ జన్మలో కావాల్సిన భుక్తి లభిస్తుంది.
- 3వ పూజ ధూపం: ఈశ్వరుడికి అత్యంత ప్రీతి ప్రాతమైన ఉపచారంలో ధూపం ఒకటి. ధూపం బాగా ఇస్తే శివుడికి బాగా ఇష్టమట. సాంబ్రాణి , అగరత్తులు, ధూపుష్టిక్కులతో పొగ పెడితే వద్దంటే డబ్బు వస్తుంది.
- 4వ పూజ దీపం: దీపం వెలిగిస్తే జ్ఞానం కలుగుతుంది.
- 5వ పూజ: ప్రదక్షిణ.. ఏ ఆలయంలోకి వెళ్లిన ప్రదక్షిణ చేయాలి. భక్తితో మెల్లగా నడచుటు, చేతులు జోడించి దేవున్ని ధ్యానించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.