Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌పై FIR.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

సనాతన ధర్మంపై వ్యాఖ్యలతో మతపరమైన భావాలను రెచ్చగొట్టినందుకు ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని పేర్కొన్నప్పటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

New Update
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌పై FIR.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

FIR on Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల వేడి చల్లారడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి స్టాలిన్ విమర్శల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి మిత్రపక్ష పార్టీలు స్టాలిన్‌పై మండిపడుతున్నాయి. కుల నిర్మూలన విషయంలోనే వ్యాఖ్యలు చేసినట్టు ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు. తన మాటలు వెనక్కి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. అటు బీజేపీ నేతలు మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు

రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar) ఏం అన్నారంటే?

➼ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను

➼ అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదు

➼ ఉదయనిధి క్షమాపణ చెప్పాలి

➼ ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు చేసి ఐదు రోజులు దాటింది

➼ ఉదయనిధి పార్టీ కాంగ్రెస్ కూటమిలోనే ఉంది కదా?

➼ రాహుల్ గాంధీ కూడా సైలెంట్‌గా ఉన్నారు

➼ ఆ కూటమిలో ఒకరు.. దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యానించారు

➼ అందుకే రాహుల్ తన మౌనం వీడి దీనిపై మాట్లాడాలి

➼ దేశ ప్రజలంతా ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్నారు

➼ ఖర్గే కూడా దీనిపై స్పందించాలి

➼ ఉదయనిధి సనాతన ధర్మాన్ని మాత్రమే అవమానించలేదు.. అన్ని ధర్మాలను అవమానించారు

➼ ఆయన డిగ్నిటీ కాపాడుకోవాలి

➼ భారత్ పేరుపై అంత రాద్దాంతం ఎందుకు?

➼ భారత్ అనేది గతంలో నుంచి ఉన్న పదమే కదా

➼ కోల్కత ను కలకత్తా.. చెన్నై.. మద్రాస్.. ముంబై.. బాంబే.. ఇవన్నీ మారాయి కదా

➼ భారత్ పదం మనది

➼ ఎప్పటి నుంచో భారత్ మాతా కి జై అంటున్నాం

➼ భారత్ ప్రెసిడెంట్ అంటే వచ్చిన నష్టం ఏంటి?


Also Read: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై సుప్రీం జోక్యం చేసుకోవాలి.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ.!!


ఉదయనిధి స్టాలిన్‌పై FIR:
మతపరమైన భావాలను కించపరిచేలా ప్రవర్తించారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీలోని సెక్షన్ 295 ఏ (ఉద్దేశపూర్వక, హానికరమైన మతపరమైన భావాలను రెచ్చగొట్టే చర్యలు), 153 ఏ (వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ కేసు రిజస్టర్ అయ్యింది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని పేర్కొన్నప్పటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాను.

ALSO READ: ద్రవిడ, సనాతన మధ్య ఈ వైరం ఎందుకు? చరిత్ర ఏం చెబుతోంది?

Advertisment
తాజా కథనాలు