/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/knl-1-1.jpg)
Nandyal : నంద్యాల టీడీపీలో మరోసారి వర్గవిభేదాలు బయటపడ్డాయి. మంత్రి ఫరూఖ్ సమక్షంలో టీడీపీ ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడు బాబురావుపై టీడీపీ కౌన్సిలర్ నాగార్జున అందరి సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి పెత్తనం ఎందంటూ బాబూరావుపై మరో వర్గం ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో ఈ విషయం నంద్యాలలో హాట్ టాపిక్ గా మారింది.