వినడానికి వింతగా ఉన్నా..
పూర్తిగా చదవండి..మనిషి ప్రాణం అంటే లెక్క లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకే చంపే దాకా వెళ్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. కుక్కల యజమానుల మధ్య జరిగిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. వినడానికి వింతగానే నిజంగానే ఇది జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజపాల్ రావత్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయన తన ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే రావత్ పెంచుకుంటున్న కుక్క, ఆయన పక్కింట్లో ఉండే పెంపుడు కుక్క గట్టిగా అర్చుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు..
గమనించిన స్థానికులు ఇరువురి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కోపోద్రిక్తుడైన రావత్ ఇంట్లోకి వెళ్లి తన వద్దనున్న తుపాకీతో గొడవ పడిన వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులను రాహుల్ (28), విమల్ (35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తుపాకీతో కాల్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ముంబైలో షాకింగ్ ఘటన.. ప్రాణం తీసిన స్వల్ప వాగ్వాదం
[vuukle]