Father's Day Special: ప్రతీ తండ్రి తన పిల్లల జీవితాన్ని ప్రత్యేకంగా మార్చడానికి పగలు రాత్రి కష్టపడతాడు. అలాంటి తండ్రికి కొన్ని చిన్ని చిన్ని జ్ఞాపకాలను, మధుర క్షణాలను అందించడానికి ప్రతీ సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 16న ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మీ నాన్నను సంతోషపెట్టేలా ఈ బ్యూటీఫుల్ చాకొలేట్ స్వయంగా మీరే తయారు చేసి మీ నాన్నతో కట్ చేయించండి. టేస్టీ బ్యూటీఫుల్ చాకోలెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము
చాక్లెట్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- 1/3 కప్పు కోకో పౌడర్
- 1/3 కప్పు వేడి నీరు
- 1/3 కప్పు వెజిటేబుల్ ఆయిల్
- ½ కప్పు పెరుగు
- ¾ కప్ కాస్టర్ చక్కెర
- 1 టీస్పూన్ కాఫీ పొడి
- ½ కప్పు బేకింగ్ పౌడర్
- ¼ కప్పు బేకింగ్ సోడా
- ¾ కప్పు మైదా పిండి
చాక్లెట్ కేక్ తయారీ విధానం
- ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్ చేయడానికి, ముందుగా ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని, దాంట్లో కోకో పౌడర్, కాఫీ పౌడర్ వేసి బాగా మెత్తని పేస్ట్‌లా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమంలో పంచదార, పెరుగు, వెజిటబుల్ ఆయిల్ వేసి బీటర్ లేదా చెంచా సహాయంతో కాసేపు కలపండి. అవసరమైతే ఇందులో కాస్త నెయ్యి లేదా వెన్న కూడా వేసుకోవచ్చు.
- కొంచెం సేపు వరకు కేక్ బ్యాటర్ ను బాగా మిక్స్ చేసిన తరువాత, అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా కలిపి మళ్లీ బాగా మిక్స్ చేయండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్స్ లో వేసుకొని ఆపై దాన్ని మైక్రోవేవ్‌లో 6 నిమిషాలు బేక్ చేయండి. అంతే రుచికరమైన, బ్యూటీఫుల్ కేక్ రెడీ. ఆ తర్వాత కేక్ పై చాక్లెట్ సిరప్ తో అలంకరించాలి. ఫాదర్స్ డే రోజున మీరు చేసిన ఈ కేక్ ను మీ నాన్న చాలా ఇష్టపడతారు.
Also Read: Ananth Ambani: రాధిక డ్రెస్ లో అనంత్ అంబానీ రాసిన ప్రేమ లేఖ.. ఫొటో వైరల్