Fastag New Rules: టోల్ పేమెంట్ ప్రక్రియలను మెరుగుపరచడం .. టోల్ బూత్‌ల వద్ద రద్దీని తగ్గించడంపై దృష్టి సారిస్తూ, అప్‌డేట్ చేసిన ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తాయి. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది, ఇందులో ముఖ్యమైన అప్‌డేట్ తప్పనిసరి FASTag నో యువర్ కస్టమర్ అంటే KYC విధానాలు. ఈ KYC ప్రక్రియ ఈరోజు నుంచి అంటే ఆగస్టు 1 నుంచి ప్రారంభం అవుతుంది. దీనికోసం అక్టోబర్ 31 వరకూ అవకాశం కల్పించారు. FASTag కస్టమర్‌లు NPCI మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వ్యవధిలోపు తమ KYC అప్‌డేట్ అయిందని నిర్ధారించుకోవాలి.
కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తాయి
చేయాల్సింది ఇదే..
- 5-సంవత్సరాల పాత ఫాస్ట్‌ట్యాగ్‌ల స్థానంలో కొత్త ఫాస్టాగ్ లను తీసుకోవాలి.
- 3 సంవత్సరాల క్రితం తీసుకున్న ఫాస్ట్‌ట్యాగ్‌ల కోసం KYC తప్పనిసరిగా అప్‌డేట్ చేయబడాలి.
- వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ .. ఛాసిస్ నంబర్ తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్‌తో లింక్ చేయాలి.
- కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజులలోపు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి
- ఫాస్ట్‌ట్యాగ్ ప్రొవైడర్లు తమ డేటాబేస్‌లను తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి
- కారు ముందు .. వెనుక వైపు స్పష్టమైన ఫోటోలను అప్‌లోడ్ చేయాలి
- ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నంబర్‌కు లింక్ చేయాలి
అంతేకాకుండా, ఆగస్టు 1 నుండి, కంపెనీలు తప్పనిసరిగా NPCI ఆదేశాలకు కట్టుబడి ఉండాలి, ఇందులో మూడు నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ల కోసం KYCని నవీకరించడం .. ఐదేళ్ల కంటే పాత వాటిని భర్తీ చేయడం వంటివి ఉంటాయి.
ఎలా చేసుకోవాలి?
మీ ఫాస్టాగ్ ప్రొవైడర్ వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ వివరాలన్నీ అప్ డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత ప్రొవైడర్ వెబ్సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ప్రొవైడ్ చేసే బ్యాంకులు, సంస్థల వద్దకు నేరుగా వెళ్లడం ద్వారా ఆఫ్ లైన్ లో కూడా మీ ఫాస్టాగ్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఇలా చేయకుంటే రెట్టింపు ఛార్జీలు..
కొద్ది రోజుల క్రితం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ వసూలుపై కొత్త గైడ్ లైన్స్ ప్రకటించింది. విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ను అమర్చని వాహనాలకు రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఇక నుంచి ఫాస్టాగ్‌ని విండ్‌షీల్డ్‌కి తప్పనిసరిగా జతచేయాలి. లేకపోతె బాదుడు తప్పదు.
FASTAG, మూడు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన RFID ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థ, జాతీయ రహదారులపై అన్ని వాహనాలు టోల్ ప్లాజాలను దాటడం తప్పనిసరి. విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌లు లేని వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యం అవుతాయని, ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని NHAI తెలిపింది. అందుకే చార్జీలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తన గైడ్ లైన్స్ లో వివరించింది.
భారతదేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలి.