Prajapalana : 'ప్రజాపాలన'లో అధికారుల నిర్లక్ష్యం.. ఆ అప్లికేషన్ ఫాములన్నీ రిజెక్ట్?

ప్రజాపాలనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 4 రోజులు ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం ఈ ఫేక్ దరఖాస్తులను నింపుతున్నారు. వాటినే అధికారులు తీసుకుంటున్నారు. ఫేక్ రేషన్ కార్డు దరఖాస్తు గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

Prajapalana : 'ప్రజాపాలన'లో అధికారుల నిర్లక్ష్యం.. ఆ అప్లికేషన్ ఫాములన్నీ రిజెక్ట్?
New Update

Fake Ration Cards: ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 5 గ్యారెంటీలను లబ్ధిపొందేందుకు కీలకమైన రేషన్ కార్డుపై ప్రజలకు సరైన సమాచారం లేదు. దీంతో ప్రభుత్వ పథకాలు తమకు అందుతాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. చాలా మంది రేషన్ కార్డు లేదని అధికారుల ద్రుష్టికి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల రేషన్ కార్డులు (Fake Ration Cards) కలుపుకుని 90లక్షలు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు 60లక్షల వరకు ఉండవచ్చని అంచనా ఉంది.

అయితే కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త రేషన్ కార్డు (New Ration Card)కోసం ఆధార్ తోపాటు ఇంకా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నదానిపై క్లారిటీ లేదు. కుటుంబ పెద్ద పేరుతోపాటు వయస్సు, లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, కుటుంబసభ్యుల వివరాలను తెలపాల్సి ఉంటుంది. వీటితోపాటు అడ్రస్, ఇంటినెంబర్,వార్డు నెంబర్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా పేర్లు కూడా తెలియజేయాలి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అధ్యక్షతన ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సంబంధిత శాఖ ఐదు పేజీల పత్రాన్ని కూడా అందజేసింది. గ్రామాల్లో విస్త్రుత ప్రచారం నిర్వహించాలని తహసీల్దార్ రెవెన్యూ, ఇన్ స్పెక్టర్ గ్రామాలకు వెళ్లి ప్రజలకు వివరించాలని పౌరసరఫరాల శాఖను సూచించింది. అయితే రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న దరఖాస్తు ఫారం ఫేక్ అని అధికారులు స్పష్టం చేశారు. ప్రజావాణి పాలనలో ఆరు గ్యాంరెటీలతో పాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేషర్ కార్డు దరఖాస్తులన్నీఫేక్ (All Rasher card applications are fake)అవ్వుడంతో ప్రజాపాలనలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. నాలుగు రోజులు కోత్త రేషన్ కార్డు కోసం జనాల చేతుల్లో ఫేక్ రేషన్ కార్డు దరఖాస్తులు ఉండటంతో వాటినే నింపుతున్నారు. అధికారులు కూడా ఫేక్ దరఖాస్తులనే తీసుకుంటున్నారు. రేషన్ కార్డు కోసం ప్రత్యేకించీ ఎలాంటి దరఖాస్తు ఫామ్ లేదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ఫేక్ రేషన్ కార్డు గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇది కూడా చదవండి: రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్స్…డిసెంబర్ 31 వరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..!!

#fake-ration-cards #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe